తెలుగులో పౌరాణిక సినిమాలకు ప్రాణం పోసింది ఎన్టీ రామారావు. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు అంటే ఎన్టీఆరే ప్రతిరూపం అనేంతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. శ్రీరాముడిగా ఉన్న ఆయన చిత్రపటాలు ఎందరి ఇళ్లలోనో దేవుడి పటాలుగా ఉండేవంటే ఆశ్చర్యం లేదు. అటువంటి ఎన్టీఆర్ రాముడిగా కాకుండా రావణుడిగా నటించిన సినిమా ‘సీతారామ కల్యాణం’. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ బ్యానర్ పై ఆయనే ఈ సినిమాను నిర్మించారు.

IHG

 

ఈ సినిమాలో హరనాధ్ శ్రీరాముడిగా, గీతాంజలి సీతాదేవిగా నటించారు. పౌరాణికాలపై పూర్తి పట్టున్న ఎన్టీఆర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని ‘సీతారాముల కల్యాణం చూతము రారండీ..’ అనే పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ పాటను సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు స్వర పరిచారు. ఇప్పటికీ ప్రతి శ్రీరామనవమి పండగ నాడు ప్రతి పందిరిలో ఈ పాట వినబడకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది ఈ పాట. ప్రతి ఫ్రేమును అందంగా మలచడంతో పాటు ఈ పాటను కూడా అంతే అందంగా తీశారు.  ఇప్పటికీ ఈ పాట మధురానుభూతిని కలుగిస్తుందనడంలో సందేహం లేదు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SEETHA' target='_blank' title='seetha -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>seetha </a>is no more!

 

శ్రీరామ జననం, సీతా జననం నుంచి సీతా స్వయంవరం, సీతారామ కల్యాణంతో సినిమా ముగుస్తుంది. 1961లో వచ్చిన ఈ సినిమాకు 59 ఏళ్లు పూర్తయ్యాయి. పౌరాణికంగా ఈ సినిమా ఇప్పటికీ ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. 1956లో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా నటించిన ఎన్టీఆర్ మళ్లీ లవకుశలో(1963) శ్రీరాముడిగా నటించారు. ఈ సినిమాలో రావణుడిగా నటించడానికి కారణం.. ఆ పాత్రపై ఆయనకు ఉన్న ఇష్టమే. రావణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: