కరోనా వచ్చి ప్రాణాయాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతుంటే అది వచ్చి  ఆహా అనిపించడం ఏంటని అనుకుంటున్నారు కదా. కరోనా ఎఫెక్ట్ తో సినిమా హాళ్లు బంద్ చేశారు. ఏప్రిల్ 14 వరకు అన్ని లాక్ డౌన్ చేయాల్సిందే. ఇదిలాఉంటే దీనివల్ల డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వాళ్లకు మంచి జరిగిందని చెప్పొచ్చు, ముఖ్యంగా ఆహా అని కొత్త ఓటిటి మొదలుపెట్టారు అల్లు అరవింద్. దానికి ఈ కరోనా బాగా కలిసి వచ్చింది. మొదట్లో మాములుగా అనిపించినా ఈ యాప్ ఇప్పుడు 1 మిలియన్ డౌన్ లోడ్స్ తో సత్తా చాటుతుంది. 

 

సినిమాలు, సీరియళ్లు కూడా రాకపోవడంతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద పడ్డారు ప్రజలు. అందుకే ఆహా యాప్ కు అన్ని షబ్ స్క్రైబర్స్ అయ్యారు. సినిమాలు, వెబ్ సేయీరీస్ లతో ఆహా అనిపించేలా ఉన్న ఈ యాప్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ ఇవ్వనుంది. కరోనా వల్లే ఇన్ని డౌన్ లోడ్స్ జరిగాయని ఒప్పుకోవాల్సిందే. అయితే వీళ్ళని పర్మినెంట్ గా ఉంచుకునేలా చేసేందుకు కొత్తగా ట్రై చేయాల్సిందే. ఆహా మాత్రమే కాదు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సం నెక్స్ట్ ఇవన్నిటికి షబ్ స్క్రైబర్స్ బాగా పెరిగారట. 

 

కొత్త సినిమాలు వెబ్ సీరీస్ లు ఇలా ఆడియెన్స్ కు కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. అందుకే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ బాగా క్లిక్ అయ్యింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ లో డేటా ప్లాన్ ఉంటుంది కనుక ఖాళీగా ఏమాత్రం బోర్ అనిపించినా ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి అందులో సినిమానో, వెబ్ సీరీస్ నో చూస్తున్నారు. ఆహా కూడా వీటికి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది. మరి 1 మిలియన్ సక్సెస్ ఫుల్ డౌన్ లోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఆహా ముందుముందు కూడా ఇలానే ఆహా అనిపిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: