‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మొదలైనప్పటి నుండి ఈమూవీలో నటిస్తున్న చరణ్ జూనియర్ ల పాత్రలకు సంబంధించి ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తుంది అన్నవిషయమై జూనియర్ చరణ్ అభిమానుల మధ్య అంచనాలు వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి మోషన్ పోష్టర్ సీతారామ‌రాజు క్యారెక్ట‌ర్ టీజ‌ర్ రిలీజ‌య్యాక జూనియర్ చరణ్ ల అభిమానుల మధ్య అభిప్రాయభేదాలు మరింత పెరిగాయి. 


ఈ టీజ‌ర్ లో చ‌ర‌ణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి అత‌డి అభిమానులు గొప్ప‌లు చెప్పుకుంటూ ఉంటే తార‌క్ వాయిస్ గురించి జూనియర్ ఫ్యాన్స్ ఎక్కువ చేసి చెప్పుకుంటున్నారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ చేసుకుంటున్నారు. దీనితో ఈ విషయం రాజమౌళి దృష్టికి కూడ వెళ్ళింది అని అంటున్నారు. 


అయితే ఈ కామెంట్స్ వార్ ను పరిశీలిస్తున్న ప్రభాస్ అభిమానులు మాత్రం జూనియర్ చరణ్ అభిమానులకు మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలలో హీరోలు కనిపించరని కేవలం పాత్రలు మాత్రం కనిపిస్తాయని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ అయ్యాక జూనియర్ చరణ్ ల కంటే క్రెడిట్ అంతా జాతీయస్థాయిలో రాజమౌళికి దక్కుతుందని గతంలో ‘బాహుబలి’ విషయంలో కూడ అదే జరిగిన విషయాన్ని చరణ్ జూనియర్ అభిమానుల దృష్టికి తీసుకు వస్తూ గతంలో ప్రభాస్ విషయంలో తమకు ఎదురైన స్వీయ అనుభవాన్ని చరణ్ జూనియర్ అభిమానులకు గుర్తుకు చేస్తూ జ్ఞానోదయం కలిగిస్తున్నారు. 


ఇది ఇలా ఉండగా ఈమధ్య రాజమౌళి ఆన్ లైన్ ద్వారా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. తాను చిన్నతనంలో ఎక్కువగా సూపర్ మెన్ స్పైడర్ మెన్ సినిమాలు చూసేవాడినని ఆసమయంలో వారిద్దరు కలిసి ఒక సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తన చిన్నతనంలోనే వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ కొన్నాళ్ళు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఒకచోట కలుసుకుంటే ఏమిజరుగుతుంది అన్న ఊహతో తాను ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్నాను అని అనడం బట్టి ఈ మూవీ చరిత్ర కాకుండా కేవలం ఒక ఊహ మాత్రమే అన్న సంకేతాలు ఇస్తున్నాడు..    

మరింత సమాచారం తెలుసుకోండి: