పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిలిం ‘వకీల్ సాబ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ మూవీ ‘పింక్’  మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ఈసినిమా ఫస్ట్ లుక్ కు అదేవిధంగా ఈ మూవీలోని తొలి పాట ‘మగువా మగువా’ కు విపరీతమైన స్పందన రావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం కరోనా  సమస్య వల్ల ఇండస్ట్రీలో ఏర్పడ్డ లాక్ డౌన్ తో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.


అయితే ఈ మూవీకి సంబంధించి కోర్టు ఆవరణలో పవన్  ఒక చేత్తో ఫైల్స్ మరో చేత్తో లెదర్ బ్యాగ్ ని పట్టుకుని నడుస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. అయితే ఈ ఫోటోలో పవన్ లుక్ ఏమాత్రం బాగుండక పోవడంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఒరిజినల్ లుక్ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగిపోతోంది. ఈపోస్టర్ చూసిన ఎవరైనా ఖచ్ఛితంగా ఆ విషయాన్ని నమ్మేస్తున్నారు.


అయితే ఇది చిత్ర బృందం రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ కాదు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ పై ముఖాన్ని మార్ఫింగ్ చేసారు. వేరొక ఫోటోకి పవన్ ఫేస్ లు మార్ఫ్  చేసారని తెలుస్తోంది. అయితే ఆలుక్ అచ్చం ‘వకీల్ సాబ్’ లుక్ అని నమ్మవల్సినంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడంతో ఈ కన్ఫ్యూజన్ ఈ మొదలైంది.

పవన్ చూపు మీసకట్టు గిరజాల జుట్టు ఇదంతా చూస్తుంటే ఏమాత్రం డౌట్ పుట్టకుండా ఈ మార్ఫింగ్ చేసారు.  ప్రపంచం మొత్తం కరోనా తో పోరాటం చేస్తుంటే పవన్ వ్యతిరేకులు మాత్రం ‘వకీల్ సాబ్’ ను తక్కువ చేయడానికి ఇలా నకిలీ ‘వకీల్ సాబ్’ ను సృష్టించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయినా షూటింగ్ లు నిలిచి పోవడంతో ఈ మూవీ ముందు అనుకున్నట్లుగా మేలో విడుదల కావడం కష్టమే అని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: