తెలుగు టెలివిజన్ లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ షో ఉన్నపాపులారిటీని బట్టి ప్రతీ ఒక్కరూ ఇందులో అవకాశం కోసం ఎదురు చుస్తూ ఉంటారు. అయితే ఇందులో అవకాశం వస్తే జనాలకి దగ్గర అవుతారు తప్పితే దానివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకు గమనిస్తే ఈ విషయంక్లియర్ గా అర్థం అవుతుంది.

 

ఇందులో కంటెస్టెమ్ట్ గా అవకాశం వచ్చి బయటకి వెళ్ళి బిగ్ బాస్ అనే ట్యాగ్ ని తగిలించుకుంటారు. కానీ వారు అనుకున్నట్టు సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. మొదటి సీజన్ లో విజేతగా నిల్చిన శివబాలాజీకి ఏం జరిగిందో చూశాం. అతనికే కాదు రెండో సీజన్లో కౌశల్ ఆర్మీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ అతడి జీవితంలో ఏ మార్పు రాలేదు., మూడవ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ ఇలా టైటిల్ విజేతగా నిలిచిన ఏ ఒక్కరి కెరీర్ మలుపు తిరగలేదు.  

 

అలాగే శ్రీముఖి, వరుణ్ సందేశ్, వరుణ్ భార్య వితికాకి కూడా బిగ్ బాస్ ఏమీ కలిసి రాలేదు. ఒకప్పుడు బిజీ హీరోగా ఉన్న వరుణ్ సందేశ్ బిగ్ బాస్ తర్వాత బిజీ అవుతానని అనుకున్నాడు. కానీ అలాంటిది జరగలేదు. అందుకని ప్రస్తుతం వరుణ్ సపోర్టింగ్ రోల్స్ చేయడానికైనా రెడీ అవుతున్నాడట. మరో పక్క వితికా కూడా అక్కా, వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధం అవుతోందిట.

 

ఈ నేపథ్యంలో ఫోటోషూట్లతో సోషల్ మిడియా ద్వారా జనాలకి దగ్గర అవుతోంది. బిగ్ బాస్ మూడవ సీజన్ అయిపోయి సంవత్సరం కావొస్తున్నా వీరికి ఎలాంటి ఆఫర్లు రాకపోవడం చూస్తుంటే.. బిగ్ బాస్ కేవలం పేరు మాత్రమే తెస్తుంది తప్ప అవకాశాలు తీసుకురాలేదని అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: