భారతీయులకు శ్రీ రామ నవమి చాలా పెద్ద పండుగ. వాడ వాడల్లో రామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పిల్ల పెద్ద అంతా మండాల్లో పెళ్లి పెద్దలైపోతారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి పెళ్లిగా భావించి ఆ సంబరాల్లో భాగమవుతారు.

రాముని పెళ్లి అంటే మనుషులే కాదు సాక్ష్యాత్తుత దైవ స్వరూపులు కూడా కాలికి గజ్జకట్టుకొని చిందేస్తారు.. పందిట్లో సందడి చేస్తారు.. అవును రాముని పెళ్లి వైభవంగా జరిపించిన దైవ స్వవూపుడు శిరిడిసాయి.. అంతే కాదు రాముని కళ్యాణాన్ని కుల మతాలకు అతీతంగా అందరూ చేసుకోవాలని సూచించాడు. సాయి.

 

రాముని సన్నిదిలో చిన్న పెద్ద అన్న తారతమ్యం ఉండదు.. పేద ధనిక అన్నతేడాలు ఉండవు.. అందుకే అందరూ కలిసి అంగరంగ వైభవంగా రాముని కళ్యాణాన్ని చేస్తారు.. ఆడిపాడి పందిట్లో సందడి చేస్తారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా రామ కళ్యాణంలో చిందేసి సందడి చేశాడు.

 

రాముడు కలియుగంలో కూడా ఎన్నో రకాలుగా ఆ భక్తులను కాపాడుతున్నాడు.. రామ అంటూ నమ్మకంగా పిలిస్తే చాలు ఆ శ్రీరామ చంద్రుడే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి మనల్ని కాపాడుతాడు.. రక్షిస్తాడు. రాముడు బంగారు పూలతో అర్చనలు కోరుకోడు.. చలువరాతి గుళ్లో పూజలు కోరుకోడు.. రామ అన్న తారక మంత్ర మనసారా స్మరిస్తే చాలు.. సాక్షాత్కరిస్తాడు.. సర్వం అనుగ్రహిస్తాడు..

 

రామ భక్తులు నిత్యం రామ నామ స్మరణలోనే జీవిస్తారు.. రామ పాదం సోకి తరించినా చాలనుకుంటారు.. శ్రీరామ పూజలో వాడే పూవుగా మారినా చాలనుకుంటారు అలా రామున్ని వేడుకుంటున్న ఈ భక్తురాలిని చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: