కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చైనా నుండి ప్రపంచ దేశాలకంతటికీ వ్యాపించిన ఈ వైరస్ అన్ని దేశాల్లో ఆందోళన సృష్టిస్తోంది. చాలాదేశాలు ఈ వైరస్ నుండి తమని తాము కాపాడుకోవడానికి లాక్ డౌన్ ని విధిస్తున్నాయి. మరికొన్ని దేశాలు లాక్ డౌన్ లేకుండానే కరోనాని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే లాక్ డౌన్ వల్ల అన్ని పనులు మానేసి ఇళ్ళలోనే ఉండిపోయారు.

 

ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. దీనివల్ల సినిమా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న డార్లింగ్ ప్రభాస్ సినిమా కూడా క్యాన్సిల్ అయిపోయింది. సాహో సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ నత్తనడకన సాగుతోంది. దాంతో చిత్ర యూనిట్ షూటింగ్ ని స్ఫీడ్ అప్ చేసే సమయానికే కరోనా కల్లోలం చెలరేగింది.

 

దాంతో ఈ సినిమా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పీరియాడిక్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ కథ యూరప్ నేపథ్యంలో సాగుతుందట. కానీ ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. మళ్లీ ఎన్నాళ్ళకి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. ప్రపంచ పరిస్థితి ఇప్పుడప్పుడే ఇతర దేశాల వారిని తమ దేశంలోకి రానిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చిత్ర యూనిట్ లో ఆందోళన పెరుగుతుందట.

 

అయితే ఎలాగైనా ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అవసామైతే కథని ఇండియాకి తగ్గట్టుగా మారుద్దమా..లేక ఇక్కడే సెట్ వేసి షూటింగ్ కానిచ్చేద్దామా అని చూస్తున్నారట. అయితే అల్రెడీ కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 
సడెన్ గా కథ మార్చడం అసాధ్యం కాబట్టి ఇక్కడే సెట్ వేసి షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం  ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: