కరోనా సమస్యతో అందరు గృహ నిర్భందానికి పరిమితం కావడంతో టీవీలకు సెల్ ఫోన్స్ కు జనం అతుక్కుపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోల అభిమానులు మటుకు తమ హీరోలకు భజన చేసే కార్యక్రమం మరింత పెంచి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో మహేష్ అభిమానుల అత్యుత్సాహం కోలీవుడ్ టాప్ హీరో విజయ్ అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించడమే కాకుండా విజయ్ అభిమానుల చేత మహేష్ కు ఉన్న సూపర్ స్టార్ ట్యాగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేసేలా పరిస్థితులు మారిపోయాయి. చెన్నైలో ఉండే మహేష్ అభిమానులు కొందరు తమ హీరో గొప్పతనాన్ని వివరిస్తూ తమిళ హీరో విజయ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది మహేష్ మూవీలను తమిళంలో రీమేక్ చేయడం వల్ల విజయ్ కి అదృష్టం కలిసి వచ్చింది అంటూ కామెంట్ చేసారు.


తమ కామెంట్స్ కు ఉదాహరణగా విజయ్ నటించిన ‘గిల్లి’ ‘పోకిరి’ సినిమాలను కోట్ చేస్తూ ఈ రెండు సినిమాలు మహేష్ నటించిన ‘ఒక్కడు’ ‘పోకిరి’ సినిమాలకు రీమేక్ అన్న విషయం విజయ్ అభిమానులకు గుర్తు చేస్తూ విజయ్ రీమేక్ స్టార్ అంటూ జోక్ చేసారు. దీనితో ఈ అనుకోని కామెంట్స్ కు రెచ్చిపోయిన విజయ్ అభిమానులు మహేష్ ను సూపర్ స్టార్ కాదని ‘డమ్మ స్టార్’ అంటూ మాటల ఎదురు దాడి మొదలుపెట్టారు. 


ప్రస్తుతం కోలీవుడ్ లో మహేష్ విజయ్ అభిమానుల మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనితో జరుగుతున్న ఈ వార్ ను పసిగట్టిన అజిత్ ఫ్యాన్స్ మహేష్ అభిమానులకు బాసటగా నిలుస్తూ విజయ్ నిజంగానే రీమేక్ స్టార్ అంటూ మరింతగా విజయ్ అభిమానులను రెచ్చగొడుతున్నారు. సాధారణంగా ఒక చిన్న విషయానికి కూడ విజయ్ అభిమానులు విపరీతంగా రెచ్చిపోతు ఉంటారు. ఇప్పుడు తమిళనాడు అంతా లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో చేసేపని లేక ఇలా మహేష్ అభిమానులతో విజయ్ అభిమానులు మాటల యుద్ధం ప్రారంభించారు అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: