హాలీవుడ్ పాప్ గాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరల్డ్ ఫేమస్ సింగర్ రిహానా రానున్న పది సంవత్సరాల్లో పిల్లలను కనాలనుకుంటుందట. ఈ సమయంలో తనకు సరైన జీవిత భాగస్వామి దొరకకపోయినా పిల్లలను మాత్రం కని పెంచాలనుకుంటుందట. రానున్న దశాబ్దంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా రిహానా ఈ జవాబు చెప్పింది. `రానున్న దశాబ్దంలో నేను పిల్లలను కనాలకుంటున్నా.. ముగ్గురు, నలుగురు పిల్లలను కంటా` అంటూ సమాధాన మిచ్చింది.

 

32 రెండేళ్ల ఈ భామ తానే ఓ చిన్నారి పెంచాలని కోరుకుంటుందట. `సమాజమే నేను ఇలా ఫీల్‌ అయ్యేలా చేసిందని చెప్పింది రిహానా. అయితే నా అభిప్రాయాన్ని ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దు. పిల్లల జీవితానికి తల్లిదండ్రులుగా మనం ఇవ్వాల్సింది కేవలం సంతోషం మాత్రమే. అదే పిల్లలకు పేరెంట్స్ కు మధ్య ఉండే ఆరోగ్యకరమైన సంబంధం. అంటూ ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కామెంట్ చేసింది రిహానా.

 

అదే సమయంలో ప్రస్తుతం తాను పూర్తిగా తన వర్క్ మీదే దృష్టి పెట్టానని చెప్పింది రిహానా. `ప్రస్తుతం నేను నా వర్క్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాను. ఎప్పుడు ఈ బిజీ లైఫ్‌ను పక్కన పెడతానో ఇప్పుడే చెప్పలేను. నేను నా ఆల్బమ్స్ విషయంలో పెద్దగా రూల్స్ ఏం పెట్టుకొని అప్పుడు సందర్భాన్ని బట్టి నాకు ఎలాంటి ఆలోచన వస్తుందో దాన్నే ఫాలో అయిపోతా అంటూ తన వర్క్ గురించి కామెంట్ చేసింది.

 

తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో రిహానా కూడా పెద్ద మనసుతో స్పందించింది. ఏకంగా 5 మిలియన్ల యూఎస్ డాలర్లను తను నిర్వహిస్తున్న క్లారా లియోనెల్‌ ఫౌండేషన్ ద్వారా అందచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: