క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రోజురోజుకు క‌రోనా వైర‌స్ మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 8,56,579 క‌రోనా కేసులు న‌మోదుకాగా, వీటిలో 1,77,039 కేసులు రికవరీ అయ్యాయి. అయితే  42,089 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. ఈ సంఖ్య గంట‌గంట‌కూ పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న క‌లుగుతుంది. ఇక క‌రోనా ఎఫెక్ట్‌తో దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇలా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ప్రమాదకరంగా పరిణమిస్తున్న కరోనా వైరస్ ప్రతి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 

 

ప్రపంచం కనీవినీ ఎరుగని ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తోంది. ఈ ప్రభావం సినీ రంగంపై కూడా తీవ్ర స్థాయిలో పడింది. కరోనా దెబ్బతో దేశ వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలతో పాటు మల్టీఫ్లెక్స్ సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. క‌రోనా వ‌ల‌న షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. షెడ్యూల్స్ లేట్ అవుతుండ‌డంతో నిర్మాత‌ల‌కి త‌ల‌కి మించిన భారం అవుతుంది. చిత్ర రిలీజ్ డేట్‌లు వాయిదా ప‌డుతున్నాయి. మ‌రియు సినిమా ఫంక్షన్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ వంటివి కూడా వాయిదా వేస్తున్నారు. ఇక ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టీ చూస్తుంటే లాక్ డౌన్ త‌ర్వాత సినిమా రిలీజ్ అయినా ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

 

మ‌రోవైపు  ఈ వైరస్ ప్రభావంతో సినిమాల‌న్నీ సమ్మర్ సీజన్ ఉండే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా థియేటర్లలో బొమ్మ పడే సూచనలు లేనికారణంగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలకావాల్సిన చిత్రాలను థియేటర్స్‌లో కాకుండా, స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం దీనిపై ఆధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: