‘అదియూ ఒక్క పురుగు.. కనిపించని పురుగు.. కరోనా నీవొక పురుగు.. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే కండ లేదు దానికి. అదే దాని బలం.. అదే దాని దమ్ము’ అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ క‌రోనాపై ఓ పాట‌ను స్వ‌యంగా రాసి పాడారు. ఈ పాట‌ను బుధ‌వారం త‌న ట్విట్ట‌ర్‌లో పెట్టారు. అంతేగాక ఈ పాట పూర్తి నిడివిని సాయంత్రం విడుద‌ల చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు. వ‌ర్త‌మాన అంశాల‌పై ఎప్పుడూ ఆర్జీవీ చాలా ఆక్టివ్‌గా స్పందిస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు..అంశాల‌పై త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ చేయ‌డం లేదా సెటైర్లు వేయ‌డం..కౌంట‌ర్లు ఇస్తుంటారు.

 అయితే ఈసారి ఆయ‌న ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై ఏకంగా పాట‌పాడుతూ అభిమానుల‌కు త‌న‌దైన శైలిలో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు.  ఇదిలా ఉండగా కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి కొంమంది నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్న ఆయన అభిమానుల‌కు  ట్విట్ల‌ర్లో స‌మాధానాలు ఇచ్చారు. కొంత‌మంది ఎలాంటి ఉప‌యోగం లేద‌ని తాను చాలాసార్లు చెప్పినా మాట‌లు ఇప్పుడిప్పుడే జ‌నాల‌కు అర్థ‌మ‌వుతున్నట్లు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. 

 

 గతేడాది విడుదలైన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ  ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి కూడా ఓ పేరడి పాట‌తో క‌రోనాపై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు పూనుకున్నారు. స్టూడెంట్‌నె.1సినిమాలోని ఎక్క‌డో పుట్టి..ఎక్క‌డో పెరిగి అన్న పాట‌కు..ఎక్క‌డో పుట్టి...ఎక్క‌డో పెరిగి..ఇక్క‌డికి వ‌చ్చింది క‌రోనా మ‌హ‌మ్మారి అంటూ పాట రాయ‌డ‌మే కాదు..పాడారు కూడా. దీనికి జ‌నాల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: