టాలీవుడ్ లో మహానటి సావిత్రి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆమె సినిమాలు ఇప్పటికే ఎప్పుటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటాయి.  ఆమె జీవిత కథపై ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘మహానటి’ తెరకెక్కించారు.   ఈ సినిమా తెలుగు, తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది.  ఇందులో మహానటి సావిత్రి గురించి చిన్ననాటి నుంచి ఆమె అంతిమ సమయంలో ఎలా ఉందన్న విషయాన్ని చూపించారు.  అయితే రీల్ లైఫ్ లో గొప్ప నటి.. రియల్ లైఫ్ లో కూడా ఆమె గొప్ప మనిషి అంటారు.  సినీ పరిశ్రమలో సావిత్రితో ఎంతో మంది పోటీ ఉండేవారని.. కానీ ఆమె ఎవరినీ పోటీ అని మాత్రం అనుకునేవారు కాదని అంటారు.   

 

మహానటి సావిత్రి గురించి షావుకారి జానకి మాటల్లో ఆమె గొప్పతనం గురించి చెప్పారు. హీరోయిన్ గా ఒక వైపున సావిత్రి చక్రం తిప్పేస్తుంటే, మరో వైపున తనకి తగిన పాత్రలను షావుకారు జానకి పోషిస్తూ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉండేవని ఒక ప్రచారం వుంది.  కొన్ని సార్లు ఆమె పాత్రలు తనకు వచ్చేవని ఆ విషయంలో కొంత మంది వీరి మద్య గొడవలు జరుగుతున్నాయని పుకార్లు సృష్టించారని అన్నారు.  ఈ విషయంపై షావుకారి జానకి మాట్లాడుతూ.. సావిత్రితో నేను కలిసి నటించాను .. మేము ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం.

 

ఒకరిని ఒకరు ఒక్క మాట అనుకున్నది లేదు.  సావిత్రమ్మతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించానని.. ఆమె చాలా గొప్ప మనిషి అన్నారు.  రీయ్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మంచితనంలో ఆమెకు ఆమే సాటి అన్నారు.  సావిత్రికి నప్పే పాత్రలు వేరు .. నాకు నప్పే పాత్రలు వేరు. సావిత్రి ఎలాంటి పాత్రలకైనా సరిపోతుంది. ఎటువంటి పాత్రలనైనా చేయగలుగుతుంది. ఆమెతో నేను ఎప్పుడూ పోటీపడలేదు .. పోటీపడాలని అనుకోనూ లేదు. సావిత్రిని చూసి నేను ఈర్ష్య పడినట్టుగా కొంతమంది ప్రచారం చేశారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: