బాలివుడ్‌లో రణ్‌బీర్ క‌పూర్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. యూత్ లో ఆయ‌నకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. బాలివుడ్ ల‌వ‌ర్ బాయ్‌గా పేరున్న ఈ కుర్ర హీరో.. తెర‌మీదే కాదు.. తెర‌వెనుకాల కూడా చాలా వేశాలు వేస్తాడు. వ‌రుస‌గా హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణం సాగించి, బ్రేక్ చెప్ప‌డంలో దిట్ట‌..   ఆయ‌నతో న‌టించ‌డానికి హీరోయిన్లు సైతం పోటీ ప‌డ‌తార‌ని అంతా అంటారు.  అయితే అంత‌టి స్టార్ హీరో స్వ‌యంగా హీరోయిన్ ఇంటికి వెళ్లి , త‌న‌తో క లిసి న‌టించాలని కోరినప్ప‌టికీ ఆమె నో చెప్పింది. ర‌ణ్‌బీర్ క‌పూర్ ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించింది. ఇంటి త‌లుపు త‌ట్టిన అదృష్టాన్ని వ‌దులుకున్న ఆ బ్యూటీ ఎవ‌రు.. ఏంటా  క‌థ తెలుసుకుందాం..  మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ బోల్డ్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కం గనా రనౌత్. బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి, లైంగిక వేధింపుల గురించి గతంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసి వార్త‌ల్లోకెక్కిన సంగ‌తి తెలిసిందే.  

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగన ప‌లు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్లు `సంజు`, `సుల్తాన్` సినిమాల్లో అవకాశాలను తి రస్కరించానని తెలిపింది.  `సంజు` సినిమాలో నటించమని అడగడానికి రణ్‌బీర్‌ కపూర్‌ మా ఇంటికి వచ్చాడు. అసలు రణ్‌బీర్‌కు `నో` చెప్పే హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా?  అయితే ఆ సినిమాలో పాత్ర నాకు అంతగా నచ్చలేదు. కాబట్టి కుదరదని చెప్పాను. ఇక, సల్మాన్ ఖాన్ `సుల్తాన్` సినిమాలో నటించే అవకాశం కూడా మొదట నాకే వచ్చింది. ఆదిత్య చోప్రా నాకు ఫోన్ చేసి అడిగారు. నేను కుదరదన్నాను. దాంతో ఆయనకు నామీద కోపం వచ్చింది. ఇంకెప్పుడూ నాతో కలిసి పనిచేయనన్నార`ని కంగన చెప్పింది. ప్ర‌స్తుతం ఒక‌టి అరా సినిమాల‌తో బిజీగా ఉంది కంగ‌నా.

మరింత సమాచారం తెలుసుకోండి: