హీరోలు అంటే వెండితెర వేలుపులు. హీరోయిన్లు అంటే అందాల భామలు. ఇద్దరి జంటా కన్నుల పంట. చూసే వారికి రెండు కళ్ళు చాలవు. అది రీల్ బంధం. అక్కడ వారు చిలకా గోరింకల్లా ఉంటే ఆ సొగసుని చూసి ఆడియన్స్ తమను వారిలో ఊహించుకుంటారు. కేవలం మూడు గంటల ముచ్చట అది.

 

అయితే హీరోలు అనగానే నిజ జీవితంలో అలా ఉండాలని లేదు. ఇక హీరోయిన్లు అనగానే అంతటి అందంతోనే బయట కనిపించాలని కూడా రూల్ కూడా ఎక్కడా  లేదు. అదంతే. సినిమా ఒక మయసభ, మాయాలోకం. బయట మేకప్ తీస్తే వారూ మనుషులే. వారు కూడా మనలాంటి వారే. అయితే సినిమా వ్యామోహం ఆడియన్స్ ని ఒక పట్టాన వదలదు.

 

ఇపుడు అదే మోజు అనాలో, గోల అనాలో హీరోయిన్లకు పట్టుకుందంటున్నారు. అయితే ఇది ఇప్పటిది కూడా కాదు. ఎంతోమంది వెండితెర వేలుపులు రీల్లో జంటలుగా కనిపించిన వారు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటి అయ్యారు. ఇప్పటి తరంలో పెద్దగా అలాంటి పిచ్చి లేదు కానీ అక్కడక్కడ మాత్రం కొంతమంది హీరోల మోజు పెంచుకుంటున్నారు.

 

ఈ మధ్యనే తమన్నా మీడియాతో మాట్లాడుతూ తనకు నచ్చిన వరుడు అంటే ప్రభాస్ లా ఉండాలని పేరు చెప్పేసింది. ప్రభాస్ అంటే ఇష్టమని ఆయన ఒకే అంటే నేను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. దాంతో ఆయన మీద చాలా మంది కన్ను ఉంది. ఆయనతో అనుష్కను కలిపి కూడా పుకార్లు పుట్టించారు కూడా.

 

ఇక ఇపుడు లేటెస్ట్ గా మరో అమ్మడు సాయిపల్లవి అచ్చం తమన్నాలాగానే మాట్లాడుతోంది. మీ పెళ్ళి ఎపుడు అని అడిగితే తనకు వరుణ్ లాంటి అబ్బాయి కనిపిస్తే ఒకే అంటూ ఫిదా హీరో మీద తెగ ఫిదా అయిపోయింది. వరుణ్ లాంటి వాడు దొరికితే నేను రెడీ అంటోంది.

 

 మరి వరుణ్ ఓన్లీ సింగిల్ పీస్. ఆయన లాంటి వాడు వేరేగా  దొరుకుతాడా. ఇదంతా సాయిపల్లవి గడుసుతనం కాకపోతేనూ  అంటున్నారు. అంటే వరుణ్ తనకు ఓకే అంటూ చాలా తెలివిగా ఈ ముద్దుగుమ్మ చెప్పేసిందన్న మాట. ఇలా హీరోలకే ఎర్త్ పెట్టేస్తే ఎలా అంటున్నారు వారి ఫిమేల్  ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: