టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ, తన సినిమా కెరీర్ మొత్తంలో 350 కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. ఇక తన కెరీర్ లో దాదాపుగా అన్ని రకాల జానర్లలో సినిమాలు చేసిన కృష్ణ, అప్పటి యువత, మాస్ ప్రేక్షకుల్లో విపరీతంగా క్రేజ్ తో పాటు ఫ్యాన్స్ ని కలిగి ఉండేవారు. ఒకానొక సమయంలో అతి పెద్ద మాస్ హీరోగా పేరు గడించిన కృష్ణ, ఎన్నో అత్యద్భుత విజయాలు అందుకున్నారు. మొదటి నుండి తన జీవితం మొత్తం సినిమాలకే అంకింతం అని, తనను నమ్మి సినిమాలు తీసే దర్శక, నిర్మాతలకు తాను న్యాయం చేయాలని ఎప్పుడూ భావించేవాడినని, ఎందుకంటే మనకు మాదిరిగానే వారికి కూడా కుటుంబాలు ఉంటాయి, కాబట్టి అన్నివిధాలా వారికి న్యాయం చేసేందుకు తాను ఎప్పుడూ ముందుకు ఉండేవాడినని కృష్ణ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. 

 

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పట్లో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త టెక్నాలజీలను తన సినిమాల ద్వారా పరిచయం చేసిన కృష్ణ, ప్రజలకు క్వాలిటీ గల సినిమాలు అందివ్వాలనేదే తన తపన అని అంటుంటారు. ఇక ఆయన కెరీర్ మొత్తంలో నటించిన 350 సినిమాల్లో ఒక ఏడాది ఏకంగా కృష్ణ నటించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే, సినిమా అంటే ఆయనకు ఎంత మక్కువో, కేవలం సినిమా ఇండస్ట్రీకే తన సమయాన్నంతా ఏవిధంగా ఆయన అంకితం చేసారో అర్ధం చేసుకోవచ్చు. 

 

ముందుగా 1970లో కృష్ణ నటించిన 16 సినిమాలు రిలీజ్ కాగా, ఆ పై ఏడాది 1971లో 11 సినిమాలు, అలానే అనంతరం 1972లో ఏకంగా ఆయన నటించిన 18 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కాగా కృష్ణ పేరిట ఉన్న ఆ రికార్డును మరొక నటుడు ఎవ్వరూ కూడా ఇప్పటివరకు అందుకోలేకపోయారు. కాగా కృష్ణ తరువాత ఏడాదికి 17 సినిమాలు రిలీజ్ చేసిన వారిలో 1964లో ఎన్టీఆర్, 1974లో కృష్ణంరాజు ఆ ఘనత సాధించిన వారిలో రెండవ స్థానంలో ఉన్నారు. ఇటీవల తన భార్య విజయనిర్మల మరణంతో కొంత కృంగిపోయిన కృష్ణ, ప్రస్తుతం తన ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: