ప్రపంచంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే.  రోజు రోజుకీ ఈ కరోనా మహమ్మారి ప్రతాపం పెరిగిపోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు 200 దేశాలకు పాకింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.60 లక్షలకు చేరింది.  కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న ఇటలీలో 24 గంటల్లో మరో 812 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 537 మంది మృతి చెందారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దేశంలో 1711 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో 54 మంది మరణించారు.

 

మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇండియా ఆందోళన చెందుతున్నది.  ఈ మాయదారి వైరస్ కట్టడికి ఒక్కో దేశం ఒక్కో తరహాలో చర్యలు చేపట్టింది. అయితే దీనిపై ఆవేదన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రభుత్వం, రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు పిలుపు నిస్తున్న విషయం తెలిసిందే. నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

 

దేశంలో లాక్ డౌన్ కొనసగుతుంది.. అందరినీ ఇంటి పట్టున ఉండమని చెబుతున్నారు.  అయితే కనిపించే మూడు సింహాలు అంటే డాక్టర్లు,  పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు  తమ సేవలు అందిస్తూ.. తమ విధులు నిర్వహిస్తున్నారు.   ‘మీరు’ అంటే మనం, ‘మనం’ అంటే దేశం..’ అంటూ ఆ వీడియోలో చెప్పారు. మనం అందరం కలిసికట్టుగా పోరాడదామని, ఆ వైరస్ ను తరిమి కొడదామని, ‘ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడదాం’ అని పిలుపు నిచ్చారు.  కాగా నేడు కరోనా వల్ల గాంధీ ఆసుపత్రిలో మరో మరణం సంబవించిన విషయం తెలిసిందే.  కరోనా కేసులు రోజు రోజు కీ పెరిగిపోతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: