టాలీవుడ్‌లో ఎంతో మంది బ్లాక్ బ‌స్ట‌ర్ హీరోలు ఉన్నారు. బాలీవుడ్ హీరోల‌ను త‌ల‌ద‌న్నే రెమ్యూన‌రేష‌న్లు తీసుకుంటున్నారు. మ‌న తెలుగు చిత్ర నిర్మాణ వ్య‌యం అయితే హాలీవుడ్ రేంజ్‌కి చేరింది. బాహుబ‌లి, సైరా, సాహో లాంటి చిత్రాలు లేటెస్ట్ ఉదాహ‌ర‌ణ‌. అయితే అంద‌గాళ్ళుగా టీనేజ్ ల‌వ‌ర్‌బాయ్స్‌గా చ‌లామ‌ణి అయ్యే హీరోలు ప‌లువురికి హెయిర్ ప్రాబ్ల‌మ్ ఉందంటే చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. సినిమాల‌లో రియాల్టీ షోల‌లో నిండైన జుట్టు  అద్భుత‌మైన హెయిర్ స్టైల్స్‌తో క‌నిపించే హీరోల అస‌లు జుట్టు ర‌హ‌స్యం తెలిస్తే విస్తుపోతారంట‌. ఇప్ప‌టికే కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్న హీరోలు మంచి ఫామ్‌లో ఉన్నాప‌ల్చ‌టి వెంట్రుక‌లు, లేదంటి బ‌ట్ట‌త‌ల కూడా ఉంటాయట అందులో మ‌రీ షాకింగ్ విష‌యం ఏమిటంటే కుర్ర హీరోలు సైతం ఈ జాబితాలో ఉన్నారట‌. అందుకే త‌మ సినీ బిజినెస్‌కు..కెరియ‌ర్‌కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా విగ్‌లు పెట్టుకుంటారు క‌దా. అందులో ల‌క్ష‌ల రూపాయ‌ల కాస్ట్ క‌లిగి ఉంటుంద‌ట‌. అయితే మ‌న టాలీవుడ్ హీరోల్లో ఎంత మందికి బ‌ట్ట‌త‌ల ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

 

అయితే ఈ లిస్ట్‌లో మొద‌టిగా చెప్పుకోవ‌ల‌సింది మ‌హేష్‌బాబు గురించే... ఈయ‌న‌కు వంశ‌పార్య‌ప‌ర్యంగా బ‌ట్ట‌త‌ల వ‌చ్చింది. కానీ కాస్త జాగ్ర‌త్త‌గా అబ్‌జ‌ర్వ చేస్తే అది మీకే అర్ధ‌మ‌యిపోతుంది. మ‌హేష్‌బాబు విగ్ వాడుతున్నాడు. కానీ అది మామూలు విగ్ కాదు ప‌క్కా కొల‌త‌ల‌తో చేసిన కొత్త ర‌క‌మైన విగ్‌. ఇక రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సైతం ఒక‌ప్పుడు ప‌ల‌చ‌టి జుట్టుతో బాధ‌ప‌డ్డాడు. కానీ ఇప్పుడు మ‌నం చూస్తున్న హెయిర్‌లైన్ మాత్రం ఒరిజిన‌ల్ కాదు. లేటెస్ట్ ప‌ద్ధ‌తుల‌తో త‌న హెయిర్‌లైన్‌ను ఒత్తుగా మార్చుకున్నాడు ప్ర‌భాస్‌. ఇక మంచు మ‌నోజ్ సైతం లేటెస్ ప్ర‌భాస్ లాంటి మోడ‌ల్ హెయిర్ విగ్‌నే వాడుతున్నాడు. ల‌వ‌ర్‌బాయ్ రామ్ సైతం లేటెస్ స‌ర్జ‌రీతో త‌న జుట్టును ఒత్తు చేయించుకున్నాడు. ఇక అక్కినేని హీరో సుమంత్‌కి ఎప్పుడో అర ఎక‌రం పోయింది. మొద‌టి రెండు సినిమాల్లో అది మ‌న‌కు అర్ధ‌మ‌యిపోతుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమంత్ విగ్ లేకుండా బ‌య‌ట‌కు రానేరాడు. 

 

చిరంజీవి సైతం పాలిటిక్స్ నుంచి క‌మ్ బ్యాక్ అయ్యాక లేటెస్ట్ విగ్ వాడుతున్నాడు. అందుకే చిరు హెయిర్ మునుప‌టికంటే ఇప్పుడు చాలా ఒత్తుగా క‌నిపిస్తుంది. ఇక మ‌న్మ‌ధుడు నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా చ‌ప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్ప‌టి నుండో అడ్వాన్స్‌గా విగ్‌ని వాడుతూ అంద‌రి క‌న్నా ముందు ఉన్నాడు. కానీ పైకి మాత్రం కేర‌ళ నుంచి నూనె తెప్పించుకున్నా అని మాత్రం క‌ల‌ర్ ఇస్తున్నారు. ఇక ఈ లిస్ట్‌లో మ‌రో బాధిత హీరో గోపీచంద్‌. చాలా అంటే చాలా ప‌ల‌చ‌గా ఉంటుంది. అందుకే ఏ సినిమాలో అయినా వ‌ర్షం సీన్ లేకుండానే అని ముందుగా ద‌ర్శ‌కుల‌కు చెబుతుంటారు. కానీ జిల్ సినిమా స‌మ‌యానికి స‌ర్జ‌రీ చేయించుకుని బాగా ఒత్తుగా చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: