బాలీవుడ్ లో కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ కంగన సిస్టర్ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఎవరైనా తేడా గా మాట్లాడినా, కామెంట్స్ చేసినా ఎడా పెడా చంపలు ఛళ్ళుమనిపించేలా సమాధానం చెప్పే బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా గురించి మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ఈ దబాంగ్ బ్యూటి అందరికి సాఫ్ట్ అని అనుకుంటారు. కాని ఈ బ్యూటీలో ఉన్న సెకండ్ యాంగిల్ అప్పుడప్పుడు గాని బయట పెట్టదు. బాలీవుడ్ సీనియర్ నటుడు శతృజ్ఞ సిన్హా గారాల పట్టి అయిన సోనాక్షి సిన్హా బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ తో గ్రాండ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా సెటిలయింది. అంతేకాదు సల్మాన్ దబాంగ్ సిరీస్ లోనుఈ బ్యూటినే నటించి హాట్ టాపిక్ అయింది.

 

ఇక తనని బొద్దుగా ఉన్నావు కాస్త తగ్గొచ్చుగా అంటే వాళ్ళని చీల్చి చెండాడేసిద్ది. ఇమ తన తండ్రి గురించి ఎవరన్నా నోరు జారితే ఇక వాళ్ళ పని పట్టేదాకా ఊరుకోదు. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కి పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మీడియావాళ్ళు లిప్ లాక్స్ గురించి, ఇతర హీరోల తో ఉన్న రిలేషన్స్ గురించి, డేటింగ్ విషయాలు గనక గనక అడిగి పొరపాటున తిక్క ప్రశ్నలు వేసినా తిరిగి కౌంటర్ ఇవ్వడం లో సోనాక్షి స్టైలే వేరు. ఇక బాలీవుడ్ హీరోలు గాని హీరోయిన్స్ గాని తన విషయంలో జోక్యం చేసుకొని అతి  చేసినా సోనాక్షి రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు కూడా సోనాక్షి సిన్హా మరోసారి బాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

ప్రస్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి తో భారీ స్థాయిలో ఆర్ధిక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్య్మలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చేయూత‌నిచ్చేందుకు సినీ సెల‌బ్రిటీలు, పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు .. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కొంతమంది అకౌంట్ కి నేరుగా భారీ మొత్తం లో అమౌంట్ ని పంపించారు.

 

అయితే కొంతమంది బాలీవుడ్ లో ప్రజలకి సహాయం చేయడానికి ముందుకు రాని సెలబ్రిటీస్ గురించి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు చేయూతనివ్వడానికి ముందుకు రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ కి బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా రియాక్టయింది. కొంతమంది తాము చేసే మంచి పనుల గురించి బయటకు చెప్పుకోరని... చెప్పుకోవాల్సిన అవసరం లేదని... కౌంటరిచ్చింది. అయితే కొంతమంది మాత్రం చేసేది కేవలం పబ్లిసిటి కోసమేనని సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు సోనాక్షి కామెంట్స్ బాలీవుడ్ స్టార్ హీరోల గురించే అంటూ ఫ్యాన్స్ తిరిగి కామెంట్స్ చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: