పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా జల్సా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ‘యావరేజ్ సినిమా ఇప్పించండి బాస్.. బ్లాక్ బస్టర్ చేస్తాం’ అని మెగాభిమానులు చిరంజీవిని అడిగిన రోజులవి. ఆ సమయంలో వచ్చిన ‘జల్సా’ అభిమానుల కోరిక తీర్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.

IHG

 

ఖుషి సినిమా తర్వాత ఏడేళ్ల వరకూ వరుస ఫ్లాపులతో అభిమానులను నిరాశపరుస్తున్న పవన్ కు హిట్ దక్కాల్సిన సమయం అది. 2008 ఏప్రిల్ 2న విడుదలైన ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించి ఏడేళ్లుగా హిట్స్ లేని పవన్ కు ఊరటనిచ్చిన సినిమాగా నిలిచింది. మొదటివారం వరల్డ్ వైడ్ గా 23కోట్లు వసూలు చేసి అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, కామెడీ, టేకింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో పవన్ స్టైల్ యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయింది.

 

 

సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పవన్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది. వ్యవస్థపై కోపంతో తిరుగుబాటు చేసే నక్సలైట్ పాత్రను తనకిష్టమైన చెగువేరా గెటప్ లో పవన్ కనిపించి ఆకట్టుకున్నాడు. అప్పట్లోనే 1000 స్క్రీన్స్ లో విడుదలైన జల్సా శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. ఇలియానా హీరోయిన్ గా నటించింది. పవన్ఇలియానా మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు, బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: