తెలుగు అమ్మాయే అయినా తమిళంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఛాన్స్ అందుకుంది రాజోలు భామ అంజలి. తెలుగులో సీతగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నలుగురు నాలుగు మాటలు అనుకోవడం కామన్. అంతేకాదు ఉన్నవి లేనివి కల్పించుకుని మరి వార్తలు రాస్తారు. అంజలి విషయంలో కూడా అదే జరిగింది. తన ఫ్యామిలీ విషయాల గురించి కొన్ని వార్తలు తనని బాధపెట్టాయని. తనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా వాటిని నమ్మి తనని దూరం పెట్టారని చెప్పుకొచ్చింది అంజలి. 

 

ఇక తను చేసింది తక్కువ సినిమాలే అయినా మినిమమ్ గ్యారెంటీ సినిమాలు చేశానని.. తానేమి ఫ్లాప్ హీరోయిన్ కాదని అనంతుని అంజలి. తాను చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయని. కాకపొతే ఆడదాపడపా సినిమాలు చేయడం వల్ల అలా అనిపిస్తుందని అన్నారు. తెలుగులో అంజలీకి పెద్దగా అవకాశాలు లేవు. ఫ్యామిలీ విషయాలు బయటకు వచ్చి తనని టార్గెట్ చేయడం వల్లే కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నానని.. ఇక మీదట వరుస సినిమాలు చేస్తా అంటుంది సీతమ్మ. 

 

తెలుగులో చాలా తక్కువమందికి వచ్చే క్లాసిక్ ఇమేజ్ అంజలికి వచ్చింది కానీ దాన్ని ఆమె వాడుకోలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా హిట్ తర్వాత అలాంటి సినిమాలే మరో రెండు మూడు చేసి ఉంటే బాగుండేది. పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తే అమ్మడి కెరియర్ బాగుండేది. కానీ ఛాన్సులు లేక ఐటం సాంగ్స్ కూడా చేసి కెరియర్ లో వెనుకపడ్డది. మంచి అవకాశం ఎదురుచూస్తున్న అంజలి ఈసారి తన సత్తా చాటేలా ఉందని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో అయినా అంజలి కెరియర్ మళ్ళీ ఊపందుకుంటుందేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: