సంతూర్ యాడ్ లో మహేష్ కూడా ఇంప్రెస్ అయ్యేలా చేసిన త్రిదా చౌదరి గుర్తింది కదా.. తెలుగులో నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య, సందీప్ కిషన్ మనసుకి నచ్చింది సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అమ్మడు ఎందుకో ఇక్కడ అసలు క్లిక్ అవ్వలేదు. ఇక బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేదు. మోడలింగ్ లో తన సత్తా చాటుతున్న త్రిదా సంతూర్ యాడ్ లో మాత్రం అదరగొట్టేస్తుంది. కొన్నాళ్లుగా సంతూర్ మమ్మీగా యాడ్ చేస్తూ వస్తున్నా త్రిదా సడెన్ గా బికినీ అవతారమెత్తింది. 

 

ఎలాగూ సినిమా ఛాన్సులు రావట్లేదు కదా అని ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది ఈ అమ్మడు. సంతూర్ మమ్మి బికినీ స్టిల్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.. హాట్ ఇమేజ్ కు సరిపడా బాడీ ఫిట్ ఉన్న ఈ అమ్మడు బికినీ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంతూర్ యాడ్ లో మమ్మి కాస్త బికినీ లుక్స్ తో భామగా మారింది. త్రిదా బికినీ లుక్స్ చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కేలా ఉంది. ప్రస్తుతం అమ్మడి బికినీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

అందం అభినయం రెండు ఉన్నా సరే త్రిధాకు లక్ కలిసి రావట్లేదని చెప్పొచ్చు. కరెక్ట్ గా ఒక మంచి సినిమా పడితే మాత్రం అమ్మడికి తిరుగు ఉండదు. ఎలాగూ మహేష్ యాడ్ లో ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి తన సినిమాలో కూడా అవకాశం ఇస్తే త్రిదా లైఫ్ సెట్ అవుతుంది. యాడ్ లో కూడా త్రిదా భలే ముద్దుగా ఉంటుంది. ఇక ఈ బికినీ లుక్స్ లో మాత్రం అమ్మడు కూడా తక్కువదేం కాదు అనిపిస్తుంది. మరి అమ్మడు ఇంత కష్టపడి ఫోటో షూట్ చేసినా అందుకు తగినట్టుగా ఆఫర్లు వస్తాయో రావో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: