దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తమిళ నటుడు విజయ్ ఒకరు. అభిమానులు ముద్దుగా 'దళపతి' అని పిలుచుకునే విజయ్ ని అతని ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ మొదటి వరసలో ఉంటాడు. తుపాకి, సర్కార్, పోలీసోడు, విజిల్ మరియు అదిరింది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత విజయ్ నుండి వస్తున్న మాస్టర్ మూవీపై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు.

 

ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ గా చేయం మరొక విశేషం. ఇన్ని అనుకూలతల మధ్య వస్తున్న 'మాస్టర్' మూవీ విజయ్ గత చిత్రాల రికార్డ్స్ చెరిపివేయడం ఖాయం అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ మూవీలో విజయ్ పాత్ర రెండు నేపధ్యాలలో సాగుతుందని తెలుస్తుంది. ఒక పాత్రలో మాఫియా లీడర్ గా ఆయన కనిపించనుండగా, మరో పాత్రలో కాలేజీ ప్రొఫెషర్ గా కనిపిస్తాడట. ఐతే మాఫియా లీడర్ కాలేజీ ప్రొఫెసర్ ఎలా అయ్యాడు అనేదే, సినిమాలో అసలు ట్విస్ట్ అని తెలుస్తుంది.

 

విజయ్ సేతుపతి, విజయ్ ల మధ్య ఆధిపత్య పోరు సినిమాకు హైలెట్ గా సాగుతుందని సమాచారం. మాస్టర్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతోందో చూడాలి. ఇదిలా ఉండగా 'దళపతి' విజయ్ - మురగదాస్ లు మళ్ళీ కలిసి 2012లో విజయం సాధించిన 'తుపాకీ' సినిమాకు సీక్వెల్ తీస్తున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అన్ని బాషలలో ఒకేసారి విడుదల కానుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు కోలీవుడ్ లో వార్త వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: