సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా హీరోగా ఎదుగుతున్న యంగ్ హీరో నాని. అష్మాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని, తనదైన యాక్టింగ్ తో దూసుకుపోతూ నేచురల్‌ స్టార్‌ గా ఎదిగాడు. హీరోగా మంచి పొజీషన్‌ లో ఉన్న నాని, నిర్మాతగానూ ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా అనే బ్యానర్‌ స్థాపించి తొలి ప్రయత్నంగా అ! అనే సినిమాను నిర్మించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కు మంచి పేరు వచ్చినా కమర్షియల్‌ గా మాత్రం సక్సెస్‌ కాలేదు.

 

అ! తరువాత నిర్మాతగా షార్ట్ బ్రేక్ తీసుకున్న నాని తాజాగా హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫలక్‌ నుమా దాస్ సినిమాతో హీరో గా సక్సెస్‌ సాధించిన విశ్వక్‌ సేన్ హీరో గా హిట్ సినిమాను రూపొందించాడు నాని. తన పేరును నిలబెట్టుకున్న ఈ సినిమా వెండితెర మీద హిట్ టాక్‌ సాథించింది. సినిమాకు మంచి వసూళ్లు వస్తాయనుకున్నసమయం లోనే కరోనా ప్రభావం మొదలు కావటంతో సినిమా తో కలెక్షన్ల మీద ప్రభావం పడింది.

 

అయితే తాజాగా ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌ లో రిలీజ్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. అమేజాన్‌ లో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు ఇంత వరకు శాటిలైట్ బిజినెస్ మాత్రం పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ సినిమాను అమేజాన్ లో కూడా వచ్చేశాక ఇక శాటిలైట్‌ బిజినెస్ పరిస్థితి ఏంటా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

సినిమా మాత్రమే కాదు నాని గత చిత్రం అ! కూడా ఇంత వరకు శాటిలైట్ బిజినెస్ పూర్తి కాలేదు. దీంతో హీరోగా నాని రికార్డ్ లు మీద రికార్డ్ లు సృష్టిస్తుంటే.. నిర్మాతగా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడేమో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: