శ్రీరామ శబ్దంలో ఏకాగ్రత ఉంది రామ శబ్దంలో కర్తవ్య పాలన ఉంది  వీటన్నిటికి మించి రామ శబ్దంలో భక్తి భావం ఉంది. సీతారాముల గురించి తెలియని భారతీయుడు శ్రీరాముడు గుడి లేని ఊరూ కూడ ఉండదు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో శ్రీరాముని ఏడోది. పద్నాలుగేళ్ల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడ శ్రీరామనవమి కావడంతో ఈరోజు కళ్యాణం ముగిసిన తరువాత రేపు పట్టాభిషేకం చేస్తారు. 

 

శ్రీరాముడు అద్వితీయ మానవతా మూర్తి భగవంతుడు అస్తిత్వాన్ని నమ్మని నాస్తికులు కూడ శ్రీరాముడు లోని 16 ఉత్తమ  లక్షణాలను చూసి స్పూర్తిని పొందుతారు. గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, దృఢ, నిష్టకలవాడు, సదాచారయుతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రిదర్శనుడు, మనోనిగ్రహం కలవాడు, క్రోధం లేనివాడు, అసూయలేనివాడు, రణభయంకరుడు, కాంతిమంతుడు అనే ఉత్తమ లక్షణాలు శ్రీరాముడులో కనిపిస్తాయి. అందుకే శ్రీరాముదుని సకల గుణ సంపన్నుడు అని అంటారు.  

 

రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారని అనాది కాలంగా ఉన్న నమ్మకం. అందుకే శ్రీరాముడి పరిపాలన లా మన పాలకుల పరిపాల ఉండాలని కోరుకుంటూ ఉంటారు. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. శ్రీరాముడు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. వాస్తవానికి దేశంలో ఏ ఇతర ప్రాంతాల్లో శ్రీరామనవమినాడు సీతారాముల కళ్యాణం చేయరు. కేవలం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. 

 

అయితే కేవలం భద్రాచలంలో మాత్రమే శ్రీరామకళ్యాణం చేసే సాంప్రదాయం శ్రీరామదాసు ప్రారంభించారు. వసంతనవరాత్రులు చేసి చివరగా రామకళ్యాణం నిర్వహించడం అనవాయితీ ఇప్పుడు ఈ విధానం ఒక పద్దతిగా మారి తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పల్లెలోను శ్రీరామ కళ్యాణం చేసి ఆనందించడం మన సంస్కృతిలో అంతర్భాగంగా మారిపోయింది. భద్రాచల రామాలయం రామదాసు కట్టిన తరువాత ఎన్నడు లేని విధంగా భక్తులు లేకుండా కరోనా ఆంక్షలు వల్ల కేవలం నేడు 40 మంది ప్రముఖుల మధ్య వేద పండితుల ఆద్వర్యంలో శ్రీరామ కళ్యాణం జరుగుతూ ఉండటంతో ఈ సంవత్సరం వెలవెలపోతోంది. ఈ రామ కళ్యాణం తరువాత అయినా దేశ ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా రాక్షసి శాంతించాలని కోరుకుంటూ ఎక్కడ ఉన్నా తెలుగువారందరికీ ఇండియా హెరాల్డ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: