సూపర్ స్టార్ మహేష్ పారితోషికం విషయంలో చాల ఖచ్చితంగా ఉంటాడు 50 కోట్ల పారితోషికం లేకుండా మహేష్ తన సినిమాలు ఒప్పుకోడు. పారితోషిక విషయంలో ఎటువంటి మొహమాటాలు పెట్టుకోని మహేష్ కు ప్రస్తుతం కరోనా సమస్య అతడికి శాపంగా మారుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 


టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మిగతా పెద్ద హీరోలు ముఫై నుంచి నలభై వరకు రెమ్యూనిరేషన్లు డిమాండ్ చేస్తారు కానీ మహేష్ రేంజ్ లో 50 కోట్లు డిమాండ్ చేయరు. అయితే ప్రస్తుతం ఏర్పడిన కరోనా పరిస్థితులు వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల పారితోషికాలలో భారీగా కోతలుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టాప్ హీరోలు తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ స్థాయిలో నిర్మాతలు హీరోలకు ఇవ్వాలి అంటే నిర్మాతల పరిస్థితి పూర్తిగా గుల్లయిపోయే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

 

తెలుగు సినిమాకు ఓవర్ సీస్ మార్కెట్ పెద్ద దన్ను. పెద్ద హీరోలకు ఓవర్సీస్ లో దాదాపు పది కోట్ల మేరకు మార్కెట్ ఉంది. ఇప్పుడు అమెరికాలోని పరిస్థితులు వల్ల అక్కడి మార్కెట్ కుప్పకూలింది. మళ్లీ ఈ పరిస్థితుల నుండి తేరుకోవడానికి టైమ్ పడుతుంది అని అంటున్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికా ఓవర్సీస్ మార్కెట్ తెరుకోవాలి అంటే ఆరు నెలలు పడుతుంది అని అంటున్నారు. దీనికితోడు తెలుగువారు ఇప్పుడు ఉపాధి సమస్యను వేతనాల కోతను ఎదుర్కొంటున్నారు. దీనితో గతంలో లా ఓవర్సీస్ బయ్యర్లు వేలాం వెర్రిగా రేట్లు పెట్టి టాప్ హీరోల సినిమాలను కొనుక్కునే స్థితిలో లేరు. 

 

దీనికితోడు ఓవర్సీస్ టికెట్ ల రేటులో కూడ కోత పడుతుంది అని అంటున్నారు. ఈ కారణంతో మన టాప్ హీరోల ఓవర్సీస్ సినిమాల గ్రాస్ మార్కెట్ లో అయిదారుకోట్లు కనీసం కోత పడుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు అంటే ఓవర్ సీస్ లో కింగ్ అన్న పేరుంది. దీనితో తొలి ఎఫెక్ట్ మహేష్ కే పడుతుంది అని అంటున్నారు. అయితే మహేష్, ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ రామ్ చరణ్ ఇలా టాప్ హీరోల సినిమాలు ఏవీ 6 నెలల లోపు విడుదల కావు. అప్పటికి పరిస్థితులు అన్నీ సద్దుకుంటాయని మరో మాట కూడ వినిపిస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: