విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎఫ్ 2 చిత్రం తర్వాత ఆయన చేసే చిత్రాల సంఖ్య బాగా పెరిగింది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. వెంకీ మామా చిత్రంలో మామా అల్లుళ్ళు ఇద్దరూ నటించినప్పటికీ వెంకీ పేరు మీదే ఆ సినిమాకి సక్సెస్ వచ్చిందని ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం తమిళ చిత్రమైన అసురన్ తెలుగు రీమేక్  నారప్పలో నటిస్తున్నాడు.

 

 

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో నారప్ప పై అంచనాలు పెంచేశాడు. అయితే ఈ సినిమాతో వెంకీ తన పారితోషికాన్ని కూడా పెంచేశాడట. గతంలో అతి తక్కువగా డిమాండ్ చేసే వెంకీ ఇప్పుడు ఆ రేటుకి డబుల్ అడుగుతున్నాడట. సీనియర్ హీరో అయిన వెంకీ ఒక్కసారిగా పారితోషికం పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారట.

 

 

ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదట. వెంకీతో సినిమాలు చేద్దామని అనుకున్న వారు ఇప్పుడు అవే కథల్ని వేరే హీరోలతో చేయడానికి సిధ్ధం అవుతున్నారట. మిడ్ రేంజ్ హీరోల కంటే కాస్తంత ఎక్కువ తీసుకునే వెంకీ ఇప్పుడు స్టార్ హీరోలు డిమాండ్ చేసినంత అడుగుతుండడంతో నిర్మాతలంతా మిడ్ రేంజ్ హీరోల వైపు మళ్ళుతున్నారట.

 

 


వెంకీ డిమాండ్ చేసిన దాన్ని ఇచ్చుకోలేక ఆయనతో అనుకున్న సినిమాలని మిడ్ రేంజ్ హీరోలతో ఒప్పేసుకుంటే ఆ హీరోలకి లాభం వచ్చినట్టే. మరి ఎఫ్ 2 సినిమాతో మార్కెట్ ని బాగా పెంచుకున్న వెంకీ నారప్ప సినిమాతో హిట్ సాధిస్తే రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం  ఉంది. మరి వెంకీ రేట్ పెంచడం వల్ల లాభం వచ్చే హీరోలు ఎవరో...!

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: