కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లవుతోంది. బ‌డి నుంచి గుడి వ‌ర‌కు అన్నీ బంద్ అయ్యాయి. వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు తెరుచు కోవ డంలేదు.  మార్కెట్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, జిమ్‌లు మొదలైన వాటిని మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రి మితం అయ్యారు. అత్య‌వ‌సరం అయితే త‌ప్ప కాలు బ‌య‌ట‌పెట్ట‌డంలేదు. పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు, మీడియా వాళ్లు త‌ప్ప మిగిలిన వా రె వరూ ఇల్లు దాటి రావ‌డంలేదు. ఫ‌లితంగా ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు అంతా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెలకొంది. ఇటువంటి పరిస్థితిలో చాలా మంది నటు లు ఫిట్ నెస్ కోసం అధిక సమయం వెచ్చిస్తున్నారు. 

బోల్డ్ నటి సన్నీ లియోన్ కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. త‌న ఇంట్లో వ్యాయామాలు చేస్తూ, కాల‌క్షేపం చేస్తున్నారు. అంతేగాక లాక్ డౌన్ పరిస్థితుల మధ్య ఫిట్ గా ఎలా వుండాలో తెలియజేస్తున్నారు. మీడియాతో ఆమె మా ట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి పలు సూచనలు చేశారు. "జంక్ ఫుడ్స్ తక్కువగానే తినండి. ఆరోగ్యకరమైన చిరు తిండికి ప్రా ధాన్యత ఇవ్వండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి. రోజంతా చిన్న చిన్న వర్కౌట్స్ చేయండి. ఇదే  కాకుండా శారీరకంగా కష్టపడి పనిచేసే ఇంటి పనులపై కూడా శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో స‌న్నీలియోన్‌తోపాటు ప‌లువురు బాలివుడ్ న‌టులు కూడా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. నిత్యం బిజీగా ఉండే షెడ్యూల్‌ను ప‌క్క‌న బెట్టి, కుటుంబంతో గ‌డుపుతున్నారు. మ‌రికొంద‌రు వారికి తోచిన వంట ప‌ని, ఇంటి ప‌నిలో బిజీగా మారిపోయారు. ఇంత‌టి క్లిష్ట ప‌రిస్థితుల్లో మన‌మంతా ధైర్యంగా ఉండాల‌ని, క‌రోనాను ఎదుర్కోవాల‌ని సూచిస్తున్నారు.  అత్య‌వ‌సరం అయితే త‌ప్ప ఇల్లు దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌ని వారు సూచిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: