ఇప్పుడు నిరుపేద.. కోటీశ్వరుడు అన్న భేదం లేదు.. సామాన్యుడు లేదు సెలబ్రెటీ లేదు ఎవ్వరినీ ఈ కరోనా ప్రభావం వదలడం లేదు.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడిక్కడ వ్యవస్థలన్నీ స్థంభించి పోతున్నాయి.  తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ఈ కరోనా ఎఫెక్ట్ తప్పలేదు.. ఆయన సొంత మేనల్లుడి అంత్యక్రియలకు హాజరు కాలేదేని దుస్థితి ఏర్పడింది.  ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ సోమవారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్, గుండెపోటు బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

 

అయితే, మేనల్లుడి అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. కేవలం 38 ఏళ్ల వయసులోనే అబ్ధుల్లా ఖాన్ చనిపోయాడు. సల్మాన్ కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగే ఈయన అంత్యక్రియలు ఇండోర్‌లో ఎప్రిల్ 1న జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా సల్మాన్ సహా చాలా మంది అబ్ధుల్లా అంత్యక్రియలకు హాజరు కావడం కాలేక పోయారు. కేవలం చాలా తక్కువ మందితోనే ఈ కార్యక్రమం జరగనుంది.  కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కావడం లేదు.

 

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విస్తరిస్తూ ఉంది.  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసినప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అకిరట్టడం ఇబ్బంది అవుతుందని అంటున్నారు.  దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా మారాయి. ఈ వైరస్ ఒక మీటరు దూరం వరకు ప్రయాణించగలదన్న కారణంతో మనిషికి, మనిషికి మధ్య కనీస భౌతిక దూరం ఒక మీటరు (మూడు అడుగులు) ఉండేలా చూసుకోవాల్సి వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: