కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెర‌గుతూ పోతుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క‌రిపై త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల‌న ప‌లువురు న‌టులు, సింగ‌ర్స్ మృత్యువాత విషయం తెలిసిందే.   తాజాగా స్టార్ వార్స్ యాక్ట‌ర్ ఆండ్రూ జాక్(76) కరోనా బారిన ప‌డి క‌న్నుమూశారు.  రెండు రోజుల క్రితం క‌రోనా సోకింద‌నే విష‌యాన్ని తెలుసుకున్న ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు.  తాజాగా కరోనా మహమ్మారి మరో సింగర్ ని బలి తీసుకుంది.  కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి.  ఎన్నో చిత్రాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి.  తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆయన మేనల్లుడు అబ్దుల్ అబ్దుల్లా ఖాన్  సోమవారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  నిన్న ఆయన అంత్యక్రియలకు హాజరు కానీ పరిస్థితి. 

 

పాటల రచయిత, గాయకుడు ఆడమ్‌ ష్లెసింగర్‌(52) కరోనా సమస్యతో మరణించారు. ఆయన గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత. అలాగే పాప్‌ రాక్‌బాండ్‌ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ వ్యవస్థాపకుడు. ఆడమ్‌ మరణాన్ని ఇటీవల కరోనా బారిన పడిన నటుడు టామ్‌ హంక్స్‌ ట్విటర్‌ ద్వారా దృవీకరించారు. కాగా ఆడమ్‌ 1995లో న్యూయార్క్‌లో ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ అనే రాక్‌ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్‌ చిత్రం ’దట్‌ ధింగ్‌ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు.  

 

అయితే ఈయన రాసిన పాట మంచి పాపులారిటీ సంపాదించింది.. ఈ చిత్రం ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు ఎంపికైంది.  ఆడమ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్‌ క్రిస్మస్‌’కి ఆడమ్‌ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.  ‘ఆడమ్‌ ష్లెసింగర్‌ లేకుండా ప్లేటోన్‌ ఉండదు. అతడు కోవిడ్‌-19 చేతిలో ఓడిపోయాడు. ఇది విచారకర రోజు’అంటూ ట్వీట్‌ చేశాడు.  ఆడమ్‌ మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: