ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో విలవిలలాడుతోంది. చిన్న పెద్ద, పేద ధనికా అన్న తేడాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఈ మహమ్మారి భారిన పడి అల్లాడిపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని తలపట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిపై సెలబ్రిటీలు కూడా తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ మోడల్ డెమీ రోజ్ కరోనా ప్రభావంపై స్పదించింది. నేను గనుక ఓ సూపర్ హీరో అయితే ఈ కరోనా కు ఒక్కకిక్ ఇచ్చేదాన్ని అంటూ కామెంట్ చేసింది.
ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంది. లాక్ డౌన్ సందర్భంగా తాను ఏం ఏం చేస్తుందో ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్ ఇస్తూనే ఉంది. 25 ఏళ్ల ఈ హాట్ మోడల్ తన ఎద అందాలను ఆరబోస్తూ ఓ హాట్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది. తన పేరుకు తగ్గట్టుగా రోజ్ కలర్ డ్రెస్‌లో బౌన్సీ హెయిర్ స్టైల్, గ్లామర్ మేకప్‌తో ఉన్న ఈ ఫోటో చూపు తిప్పుకోనివ్వని రేంజ్లో ఉంది.
ఈ ఫోటోతో పాటు మరో మాట్ ఫోటోను కూడా షేర్ చేసింది రోజ్, సిల్క్ టాప్‌లో కర్లీ హెయిర్ తో ఉన్న ఆ ఫోటో కూడా అభిమానులను ఓ రేంజ్లో అలరిస్తోంది. ఆ ఫోటోతో పాటు `ఇంట్లో బోర్‌గా ఉంది` అంటూ కామెంట్ చేసింది.