ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే వారికి కూడా కాస్త ఖాళీ సమయం దొరికింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు కూడా తమలోని ఇతర టాలెంట్‌ లను బయటపెడుతున్నారు. ఇప్పటికే సల్మాన్, జాన్వీలు పెయింటింగ్ వేస్తూ తమ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా తాజాగా మరో బ్యూటీ కూడా తనలోని టాలెంట్ ను చూపిస్తోంది.

 

స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల భామ సారా అలీఖాన్. ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంట్లో నే ఉంటున్న సారా అలీఖాన్‌ తనలోని డాన్సింగ్ టాలెంట్‌ ను బయటపెట్టింది. ట్రెడిషనల్ ఒడిస్సీ డాన్స్ చేస్తున్న సారా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  నిన్న రాత్రి పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 21 లక్షల మందికి పైగా చూశారు.

 

ఇక సినిమాల విషయానికి వేస్తే ఇటీవల ఇంతియాజ్‌ అలి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ ఆజ్‌ కల్‌ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్ తో కలిసి నటించింది. ఈ సినిమా తరువాత 1995 సూపర్‌ హిట్ సినిమా కూలీ నెంబర్ 1  సినిమాలో వరుణ్ ధావన్‌కు జోడిగా నటించనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ali KHAN' target='_blank' title='sara ali khan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sara ali khan (@saraalikhan95) on

మరింత సమాచారం తెలుసుకోండి: