అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లకు  తెలుగులో ఒక సరికొత్త ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఏర్పరిచారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆహా అంటూ మొదలుపెట్టిన ఈ ఓటిటి మొదట్లో కాస్త ఇంప్రెసివ్ గా అనిపించకపోయినా లాక్ డౌన్ వల్ల దానికి బాగా డిమాండ్ పెరిగింది. లేటెస్ట్ గా ఆహా 1 మిలియన్ డౌన్ లోడ్స్ కూడా పూర్తి చేసుకుందని ప్రకటించారు. ఇప్పటికే ఆహాలో వెబ్ సీరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ వల్ల ప్రేక్షకులంతా దాని మీదే పడేసరికి అది కూడా లాక్ డౌన్ అయ్యింది. అదేంటి అంటే హెవీ ట్రాఫిక్ వల్ల ఆహా యాప్ కూడా పనిచేయడం మానేసింది. 

 

అంతరాయానికి చింతిస్తున్నాం అంటూ ఆహా టీం ఒక స్పెషల్ నోట్ కూడా పెట్టింది. హెవీ ట్రాఫిక్ వల్ల నెట్ వర్క్ సపోర్ట్ లేకపోవడంతో యాప్ డౌన్ అయ్యింది. అయితే మొదలు పెట్టేప్పుడే ఇలాంటి టెక్నీకల్ ఇష్యూస్ వస్తాయని ఆహా టీం ఎందుకు ఊహించలేదన్నది మొదటి ప్రశ్న. అంటే ఆహా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాగా క్లిక్ అవదని జస్ట్ ట్రయిల్ మాత్రమే వేశారా. అయినా యాప్ ను రిలీజ్ చేస్తున్నప్పుడు లక్షల మంది ఒకేసారి యాప్ వాడుతారన్న చిన్న లాజిక్ వీళ్ళు ఎలా మిస్ అయ్యారని అంటున్నారు. 

 

ఏదో పెట్టాం అంటే పెట్టాం అన్నట్టు కాకుండా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయడమే గొప్ప విషయం. ఎక్కడ కూర్చోనైనా చూసే సౌలభ్యం కోసం డిజిటల్ స్ట్రీమింగ్ ను ఎంచుకుంటారు. అయితే అది కూడా ఇబ్బందులు పెడితే ఇక మీదట ఎక్కువ డౌన్ లోడ్స్ జరిగే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రస్తుతం డౌన్ లోడ్ చేసుకున్న వారు కూడా నెలకో, మూడు నెలలకో ప్యాకేజ్ పూర్తి కాగానే డిలీట్ చేస్తారు. ఇక మీదట అయినా ఆహా టీమ్ ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: