ప్రపంచవ్యాప్తంగా వణికిస్తుంది కరోనా వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. అత్యంత టెక్నాలజీ ఉన్న దేశాలు కూడా ఈ కరోనాని ఏమీ చేయలేని పరిస్థితి. చిన్న దేశాలు.. పెద్ద దేశాలు అనే తేడా లేకుండా కరోనా అన్ని దేశాలకు వ్యాపించి నరకం చూపిస్తుంది.  ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 47 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 9.32 లక్షలు దాటగా, గడచిన 24 గంటల్లో 5వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఐరోపా ఖండంలోనే 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

 

ప్రతి నలుగురు మృతుల్లో ముగ్గురు ఇటలీ, స్పెయిన్‌లకు చెందినవారే కావడం బాధాకరం. ఈ రెండు దేశాల్లో ప్రాణనష్టం గణనీయంగా ఉంది. గ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా వణికిస్తోంది. ఇప్పటికే కరోనా మరణాల్లో చైనాను దాటేసిన అమెరికా.. బాధితుల విషయంలో రెండు లక్షలు దాటేసింది. ప్రతాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమికూడేందుకు ఇది సమయం కాదని, ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

 

దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడని, ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం మరింత ప్రస్ఫుటించేలా వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. వైరస్ మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రెహమాన్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని,  ప్రాణాలను లెక్కచేయకుండా డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్న ఈ సంక్షుభిత సమయంలో ఎవరూ భేషజాలకు పోవద్దని హితవు పలికారు. లక్షల మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: