చిరంజీవి స్టోరీస్ సెలక్షన్లో కాదు, బ్యానర్, డైరెక్టర్ ఇలా అనేక విషయాల్లో మంచి జడ్జిమెంట్ తో ఉంటారు. ఆయన వర్తమానంలో ఉంటారు. ఈ రోజుకు తగినట్లుగా తనను తాను అప్ టు డేట్ గా ఉంచుకుంటారు. అందువల్ల చిరంజీవి దగ్గర చనువు చూపించి ఎవరూ అంత ఈజీగా చాన్స్ కొట్టేయలేరు.

 

అయితే ఓ డైరెక్టర్ మాత్రం చిరంజీవితో సినిమా తీయడం జీవిత ఆశయంగా పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు పూరీ జగన్నాధ్, ఆయన అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు. మెగా హీరోతో కూడా అప్పట్లో చాన్స్ ఇలా వచ్చినట్లే వచ్చి పోయింది. దాంతో బాగా అప్సెట్ అయ్యాడనే చెప్పాలి.

 

ఈసారి అలా కాకుండా భారీ ప్యాకేజి తోనే ఆయన మెగాస్టార్ ని కలవబోతున్నాడుట. ఇపుడు చిరంజీవికి ఉన్న ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని మంచి కధను పూరీ రాస్తున్నాడుట. ఎటూ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అయింది. పూర్తి రెస్ట్ వచ్చేసింది.

 

దాంతో ఆయన ఇపుడు చిరంజీవి కధ మీదనే కూర్చుంటున్నాడుట. ఈ కధ పూర్తి చేసి చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకోవడమే తరువాయి అంటున్నారు. అదే జరిగితే చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న కొరటాల సివ మూవీ తరువాత పూరీ సినిమాతోనే సెట్స్ పైకి వెళ్ళడం ఖాయం అంటున్నారు. వాటి కోసమైనా ఈ కలయిక చూడాలి.

 

మరి చిరు నచ్చే కధను పూరీ రెడీ చేస్తున్నారగానే ఫ్యాన్స్ లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో చిరు, పూరీ మూవీ ఏ రేంజిలో ఉండబోతోందన్న చర్చ ఓ వైపు సాగుతోంది. మరి పూరీ చిరుకి కధ చెప్పి బుట్టలో వేసుకుంటారా. ఇది చాలా పెద్ద ప్రశ్న. జవాబు కోసం ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ కాంబో మీద మాత్రం చాలానే అంచనాలు ఉన్నాయన్నది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: