టాలీవుడ్ యువ నటుడు మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇటీవల యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండగే. రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. కుటుంబంలోని బంధాలు, అనుబంధాల నేపథ్యంలో ఆకట్టుకునే ఒక మంచి పాయింట్ తో పలు కమర్షియల్ హంగులతో గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ ని అందుకుని సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. 

 

సాయి తేజ్ అత్యద్భుత నటన, హీరోయిన్ రాశి ఖన్నా ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు సినిమాలో కీలక పాత్రలో నటించిన తమిళ నటుడు సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించడం, ఎస్ ఎస్ థమన్ అందించిన సుమధురంగా సాగే సాంగ్స్ వంటివి ఈ సినిమా మంచి హిట్ కొట్టడానికి కారణాలుగా నిలిచాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ కొట్టడంతో పాటు ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రదర్శితం అయిన సమయంలో ఏకంగా 15.3 టిఆర్పి రేటింగ్స్ తో మంచి రికార్డు ని సొతం చేసుకుంది. 

 

ఇటీవల రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఇది మంచి రికార్డు అని, అంతేకాక హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక టిఆర్పి రేటింగ్ సంపాదించిన సినిమాగా ఒక సెన్సేషనల్ రికార్డు నమోదు చేసినట్లు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరోగా సాయి తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: