టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచం అయ్యారు. ఈ మూవీ తర్వాత మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  ఆ మద్య బాలీవుడ్ లో ఒకప్పుడు అమితాబచ్చన్ నటించిన జంజీర్ రిమేక్ గా జంజీర్ మూవీలో నటించాడు.  ఈ మూవీ తెలుగు లో తుఫాన్ గా రిలీజ్ అయ్యింది.  ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.  కాకపోతే  ఈ మూవీ రెండు భాషల్లో పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. 

 

గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం మూవీతో మరో సెన్సేషన్ విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్ఆర్ ఆర్ మూవీ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో రామ్ చరణ్ కి సంబంధించిన ఓ వీడియో తన పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు.  సాధారణంగా లాఠీ ప‌ట్టి నెత్తిన మూడు సింహాల టోపి పెట్టి గూండా రాయుళ్ళ భ‌ర‌తం పట్టే పోలీస్ పాత్ర‌ల‌లోత‌మ హీరోల‌ని చూడాల‌ని అభిమానులు ఎంతగానో ఆశిస్తుంటారు.

 

దాదాపు టాలీవుడ్ హీరోలంద‌రు క‌నీసం ఒక్క‌సారైన పోలీస్ పాత్ర‌లో క‌నిపించి అలరించి ఉంటారు. రాంచరణ్  మొదటిసారి హిందీ చిత్రం  జంజీర్ లో అసిస్టెంట్ కమీషనర్ రోల్ చేశాడు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ధృవ చిత్రంలో కూడా ఆయన ఐ పి ఎస్ అధికారి పాత్ర చేయడం జరిగింది.  ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చరణ్ పోలీస్ గా కనిపించనున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ అయిన వీడియోలో పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు.  దీన్ని బట్టి ఈ మూవీలో మరోసారి పోలీస్ గా కనిపిస్తాడా అన్న అనుమానాలు ఫ్యాన్స్ కి కలుగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: