నాచురల్ స్టార్ నాని సినిమా అంటే సేఫ్ ప్రాజెక్ట్ అన్నట్టే లెక్క. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి నాచురల్ స్టార గా క్రేజ్ తెచ్చుకున్న నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీగా ఆడుతుంది. భలే భలే మగాడివోయ్ తర్వాత వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం వి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. 

 

ఇక ఈ సినిమాతో పాటుగా శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇక ఇదిలాఉంటే ఒక పక్క హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా నాని తన అభిరుచి చూపిస్తున్నాడు. మొదటి సినిమా అ! అందరిని ఇంప్రెస్ చేసింది. నాని నిర్మాతగా కొత్త ప్రయోగాలు చేస్తాడని చెప్పుకునేలా చేసింది అ!. ఇక నాని నిర్మాతగా చేసిన సెకండ్ మూవీ హిట్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మౌత్ టాక్ బాగానే వచ్చినా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. 

 

సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. అయితే ఇప్పటివరకు సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మలేదని తెలుస్తుంది. సినిమాకు ముందు ఒకటి రెండు ఆఫర్స్ వచ్చినా నాని ఆఫ్టర్ రిలీజ్ అని చెప్పాడట. ఇప్పుడు రిలీజ్ తర్వాత కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవలేదు కాబట్టి తక్కువకు అడుగుతున్నారట. అందుకే నాని హిట్ ఇంకా శాటిలైట్ కు అమ్మలేదని తెలుస్తుంది. తాను హీరోగా నటించిన సినిమాతో కలిపి హిట్ సినిమాను అమ్మే ఆలోచనలో ఉన్నాడట నాని. అలా అయితే రెండు విధాలుగా లాభం పొందినట్టు అవుతుందని నాచురల్ స్టార్ నాని ఆలోచన. మరి హిట్ మూవీని ఏ ఛానెల్ పొందుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: