కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇండియాపై కూడా ఈ మహమ్మారి పంజా విసిరింది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. వైరస్ సోకుతుందనే భయంతో మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా మరణాల గురించే మాట్లాడుతున్నారు.  కరోనాని పూర్తిగా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో ఇంటిపట్టున ఉండాలని అంటున్నారు.  అంతే కాదు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. సామాజిక దూరం పాటించాలని.. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి వెంటనే వైద్యుల వద్దకు పంపాలని.. మోహమాటాలకు వెళ్లితే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.  టాలీవుడ్ లో సినీ కార్మికుల కోసం ఇప్పటికే సినీ నటులు తమ ఉదార మనసు చాటుకుంటున్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ ఒక్కోరీతిన స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు.  ఇండస్ట్రీ తరపున చిరంజీవి ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. 

 

దీని ద్వారా సమీకరించిన డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు.  కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. మొన్న హీరో నిఖిల్, ఈ రోజు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ పేదలకు 2 వేల మాస్కులు, 2 వేల శానిటైజర్లు అందించడంతో పాటు వెయ్యి మందికి అన్నదానం చేశారు.  త్వరలో లాక్ డౌన్ ఎత్తివేస్తారని.. అప్పటి వరకు ప్రజలు ఇంటిపట్టున ఉండాలని.. అత్యవసర పనులైతే తప్ప బయటకు రావొద్దని అంటున్నారు.  కరోనా ఇప్పుడు ఉగ్రరూపం దాల్చి విజృంభిస్తుందని.. ఈ సమయంలో ఇంట్లోనే ఉండాలని అంటున్నారు వైద్యులు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: