ప్రస్తుతం కరోనా మహమ్మారి భయం గుప్పిట్లో ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్నాళ్లపాటు తమ దేశ ప్రజలను పూర్తిగా తమ తమ ఇళ్లకే పరిమితం చేసేలా ఇప్పటికే లాకౌట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరికి వారు పూర్తిగా ఈ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే ఈ మహమ్మారిని త్వరితగతిన తరిమికొట్టగలమని పలువురు డాక్టర్లు, అధికారులు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మన దేశాన్ని 21 రోజుల పాటు లాకౌట్ ప్రకటించిన నరేంద్రమోడీ, ప్రజలు ఎవ్వరూ కూడా తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, అది కూడా ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే వెళ్లాలని, ఒకరోజులో వీలైనన్ని ఎక్కువసార్లు శానిటైజర్ లేదా సబ్బుతో తమ చేతులు శుభ్రం చేసుకోవడం, అలానే దగ్గు, తుమ్ము వచ్చిన సమయంలో గట్టిగా చేతిని మోచేతివరకు ముక్కు, నోటి దగ్గర అడ్డుపెట్టుకోవాలని సూచించడం జరిగింది. 

 

దీనితో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అవడంతో పాటు అన్ని కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతబడడంతో పాటు దేశంలో ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే కొంత దెబ్బతినే పరిస్థితులు రావడం జరిగింది. కాగా ఈ లాకౌట్ ప్రభావం ముఖ్యంగా మూగజీవాల పైన కూడా పడింది. ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్ళనుండి బయటకు రాకపోవడంతో రోడ్లపై తిరిగే జంతువులకు ఆహారం కరువై అవి ఆకలితో అలమటిస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం వలన ఒక పుకారు విపరీతంగా షికారు చేస్తోంది. అదేమిటంటే, కుక్కలు, పిల్లులు వంటి పెట్స్ ని పెంచుకునే వారికి ఈ కరోనా వెంటనే సోకుతుందని పలువురు దుష్ప్రచారం చేయడంతో, అది నిజమే అని నమ్మి కొందరు ప్రజలు తమ పెట్స్ ని దగ్గరకు రానివ్వకుండా వాటిని పట్టించుకోవడం మానేస్తున్నారని, అయితే ఆ ప్రచారం అవుతున్న ఈ వార్త పూర్తిగా విరుద్ధం అని, రెడ్ క్రాస్ సొసైటీ మెంబెర్, అక్కినేని నాగార్జున సతీమణి అమల అన్నారు. 

 

కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పెట్టిన ఆమె, కరోనా వైరస్ అనేది పెట్స్ నుండి మనకు వస్తుంది అనేది పూర్తిగా అవాస్తవం అని, దానిని నమ్మి మూగజీవాల పట్ల కఠినంగా వ్యవహరించడం పాపం అని, స్వయంగా హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థవారు పెట్స్ వలన ఈ వ్యాధి మనకి సంప్రదించదని భరోసా ఇస్తున్నారని, అలాంటపుడు మనం భయపడడం అర్ధం లేనిదని ఆమె అన్నారు. కాబట్టి ఇకనైనా ప్రజలు తమ పెట్స్ ని ఎప్పటివలె ఆదరించడంతో పాటు వీలైతే రోడ్డుపైన ఉన్న మూగ జీవాలకు తమవంతు సాయం అందించాలని ఆమె అభ్యర్ధించారు....!!

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: