ఫిలిం స్టార్స్ గురించి మాత్రమే కాదు స్టార్స్ కిడ్స్ గురించి తెలుసుకునేందుకు కూడా మీడియా, ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. అలా మీడియాలో విపరీతంగా ఫోకస్ అయిన స్టార్ కిడ్స్ చాలా మందే ఉన్నారు. అతిలోక సుందరి  శ్రీదేవి కూతురు మీద కూడా ఓ రేంజ్‌లో కాన్ సన్ ట్రేషన్ ఉంది సోషల్ మీడియాకు, ఫ్యాన్స్ కు.  అసలు బాలీవుడ్ స్టార్ కిడ్స్ లో గురించి ఎక్కువగా మాట్లాడుకునేది జాన్వీ కపూర్, ఖుషీ కపూర్  గురించే. జాన్వీ ఆల్రెడీ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు రెండో కూతురు ఖుషీ తన దైన స్టైల్లో ర్యాంప్ వాక్స్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది.

 

మరో సెలబ్రిటీ సన్ అహాన్ పాండే కూడా బాలీవుడ్ డెబ్యూ కి రెడీ అవుతున్నాడు . ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అనన్యపాండే కి కజిన్ అయిన అహాన్ కి ఇన్ స్టా లో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ ఎంట్రీ కోసం  యష్ రాజ్ ఫిల్మ్ లో సినిమాకి సైన్ చేశాడట అహాన్  పాండే .

 

బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ కూతురు షనయా కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ మీదకు రావడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. జాన్వి కపూర్ కజిన్ అయిన షనయా.. ప్రస్తుతం జాన్వి చేస్తున్న ద కార్గిల్ గర్ల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడాపనిచేస్తోంది.  సినిమాల్లోకి రావడానికి అవసరమైన డ్యాన్స్ ని అందులో బెల్లీ డ్యాన్స్ ని ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తోంది ఈ 20 ఏళ్ల షనయా కపూర్. 

 

బాలీవుడ్ యాక్షన్ హీరో అయిన సునీల్ శెట్టి కొడుకు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు . సునీల్ కొడుకు అహాన్ శెట్టి ప్రస్తుతం .. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆర్ ఎక్స్ 100 సినిమాని మోహిత్ సూరి డైరెక్షన్లో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: