క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రినీ చుట్టేస్తుంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా నాకు అంద‌రూ స‌మాన‌మే అంటుంది.  సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఈ వైర‌స్ అంద‌రిన్నీ గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి చాలా మంది మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రికొంద‌రు డేంజ‌ర్ జోన్‌లోకి వెళ్ళి నానా తంటాలు ప‌డుతున్నారు. కరోనా ఈ రేంజ్ లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వైరస్ ని మాత్రం కంట్రోల్ చేయలేక పోతున్నారు. అక్క‌డ‌కి చాలా క‌ట్ట‌డి చేసి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు.

 

ఈ విష‌యంలో ఇద్ద‌రి సీఎంల‌కి చేతులెత్తి మొక్కాలి. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే... కరోనా వైరస్ కి వాక్సిన్ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే కేంద్ర ప్రభుత్వాలు కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు మాత్రం పకడ్బందీ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా మన దేశానికి విదేశాల నుండి పాకిందని విషయం తెలిసిందే. భారతదేశంలో ఈ వైరస్ స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. దీంతో విదేశీయులను అనుమతించడం ఆపేశారు. మన దేశంలో కూడా  రాకపోకలను నిలిపివేశారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాల చాలా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. 

 

ఇక మనదేశ ప్రజలు కూడా విదేశాల్లో భారీ సంఖ్యలో చిక్కుకుపోయారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్‌ను విధిగా పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మలయాళం స్టార్ హీరో తన చిత్ర యూనిట్‌తో స‌హా అక్క‌డ ఇరుక్కుపోయారట. ఆడుజీవితం అనే మూవీ షూటింగ్ లో భాగంగా పృథ్వీరాజ్ - ఆయన బృందం జోర్డాన్ కు వెళ్లారు. అయితే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్ ను అనుమతి ఇవ్వలేదట. తరువాత మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో కొన్ని రోజులు పొడిగించారని తెలిపాడు. కానీ ఈ  కరోనా మ‌హ‌మ్మారి మాత్రం మరింత తీవ్రం కావడంతో షూటింగ్ పూర్తిగా నిలిపేశారు. అయితే అక్కడే ఒక హోటల్ రూమ్‌లో ఉన్నట్లు స‌మాచ‌రం అంతేకాక‌ వారితో ఒక డాక్టర్ ని కూడా ఉంచుకున్నారట. ఇదిలా ఉండగా హీరో పృథ్వీరాజ్ మాట్లాడుతూ... తామంతా టీమ్ తో పాటు ఆరోగ్యాంగా ఉన్నట్లు తెలియజేసాడు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఇండియాకి వస్తామని ఎవ్వ‌రూ కూడా కంగారు ప‌డ‌వ‌ద్దంటూ త‌న ఫ్యాన్స్‌కి ఆయ‌న ధైర్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: