కరోనా ఎఫెక్ట్ తో సినిమాల షూటింగులు ఆపేశారు. సినిమా హాళ్లను కూడా గత 20 రోజులుగా క్లోజ్ చేశారు. కరోనా పుట్టిన దేశం చైనాలో రీసెంట్ గా థియేటర్లను తెరచినట్టు తెలుస్తుంది. కొన్ని నియమ నియంత్రణలతో సినిమా హాళ్లను నడిపించేలా చూస్తున్నారు. అదెలా అంటే 1000 సీట్లు ఉన్న థియేటర్ కు కేవలం 250 టికెట్స్ మాత్రమే సెల్ చేసేలా ప్లాన్ చేశారు. అంటే 1000 మంది కూర్చునే ప్లేస్ లో 250 మంది అంటే.. మనిషికి మనిషికి కనీసం ఒకటి రెండు సీట్ల గ్యాప్ ఉంటుందన్నమాట.

 

అయితే చైనాలో లాగా ఇండియాలో ఆ రూల్ పాటిస్తూ థియేటర్లు తెరిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఏప్రిల్ 15 తర్వాత ఎలాగూ లాక్ డౌన్ ఎత్తేస్తే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు థియేటర్లు కూడా తెరవొచ్చు.. కానీ ఇలా కేవలం 250 టికెట్స్ మాత్రమే సెల్ చేసి సినిమాలు ఆడించాల్సి ఉంటుంది. అయితే స్టార్ హీరోల సినిమాలకు టికెట్ల కోసం కొట్టుకోవడం గురించి తెలిసిందే.. మరి 250 టికెట్స్ మాత్రమే అంటే కొద్దిగా కష్టమే.

 

ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 21 రోజులు దేశం మొత్తం లాక్ డౌన్ అవడం వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. మరోపక్క కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్లో ఎక్కువా కనబడుతుంది. అందుకే ఈ 12 రోజులు సీరియస్ గా లాక్ డౌన్ పై దృష్టి పెట్టి ఆ తర్వాత పరిష్టితిని బట్టి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది  ప్రస్తుతం చైనాలో థియేటర్ల పరిస్థితి అలా ఉండగా మన దగ్గర ఎలాంటి రూల్స్ పెడతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: