టాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకులుగా కొనసాగుతున్న వారిలో మొదటగా వచ్చే పేరు థమన్.. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పేరే గుర్తుకు వస్తుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ గట్టి పోటీ నెలకొంది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలకి ఒకే ఒక్క ఛాయిస్ గా ఉండే దేవిని వెనక్కి నెట్టి థమన్ దూసుకువచ్చేశాడు. వీరిద్దరి మధ్య ఈ సంక్రాంతికి జరిగిన పోటీలో చాలా క్లియర్ గా థమన్ పైచేయి సాధించాడు.

 

 

అయితే ప్రస్తుతం మరో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ వీరిద్దరికీ కాంపిటీషన్ రాబోతున్నాడు. స్వరబ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్భుతమైన సంగీతాన్ని అందించేవాడు. ముఖ్యంగా ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. అయితే కొన్ని రోజులుగా కొత్తదనాన్ని అందుకోలేక వెనకబడ్డాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ తనని తాను నిరూపించుకున్నాడు. ఆ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాతలందరూ మళ్లీ మణిశర్మ దగ్గరకి వస్తున్నారు.

 

 

ఇస్మార్ట్ శంకర్ విజయంతో మణిశర్మ చేతిలో ఆరు సినిమాలు వచ్చి పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి తానెప్పుడూ చేయించుకునే దేవిని కాదని కొరటాల మణిశర్మ వైపు మొగ్గుచూపాడు. ఇదొక్కటే కాదు కిషోర్ తిరుమల - రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రెడ్' సినిమాకి, వెంకటేష్ 'నారప్ప'.. గోపీచంద్ 'సిటీమార్'.. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ సినిమా 'ఫైటర్'.. సాయి ధరమ్ తేజ్ - దేవా కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

 


ఈ చిత్రాలన్నింటికీ పాజిటివ్ బజ్ ఉంది. మరి ఈ చిత్రాలు హిట్ అయితే గనక టాప్ లో కొనసాగుతున్న థమన్, దేవి లాంటి వాళ్ళకి పోటీ వచ్చినట్టే.. మరి మణిశర్మ దూకుడుని వారిద్దరూ ఎలా తట్టుకుంటారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: