లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రిటీలంతా తమ ఇంటికే పరిమితం అవుతూ తమలో అంతర్గతంగా ఇమిడి ఉన్న కళలను బయటపెడుతూ తమ కళలను మరింత మెరుగు పరుచుకునెందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యుల దగ్గర నుండి అసామాన్యుల వరకు భార్య భర్త అక్క చెల్లి అన్నా తమ్ముడు అంటూ బంధాలు గుర్తు చేసుకుని ఆ ప్రేమాను రాగాల్లో మునిగి తేలుతున్నారు. 

 

దీనితో కరోనా జనం మరిచిపోయిన సమిష్టి కుటుంబాలను తిరిగి గుర్తుకు చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  హీరోలు హీరోయిన్స్ జిమ్ముల్లో వర్కౌట్లు యోగా శాలలో యోగాలు చేస్తూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ తమ ఫిట్ నెస్ లో తేడాలు రాకుండా చూసుకుంటూ ఉంటే  అలియా భట్ మాత్రం వీళ్లందిరికీ భిన్నంగా ఆన్ లైన్ లో రైటింగ్ సర్టిఫికేషన్ కోర్స్ చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు అలియా భట్ ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలో ఈకోర్సును కరోనా సెలవులు పూర్తయ్యేలోపు పూర్తిచేయాలని సీరయస్ గా చదివేస్తుందిట. 


అంతేకాదు తన క్రియేటివ్ రైటింగ్ మెరుగు పరుచుకోవడానికి అలియా అనేకప్రయత్నాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నట్లు సమాచారం. వాస్తవాని దర్శక నిర్మాత మహేష్ భట్ తనయురాలిగా అలియా మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అని అందరికి తెలిసినా క్రియేటివ్ రైటింగ్ విషయంలో అలియా చూపిస్తున్న శ్రద్ధను చూసినవారు ఈమె త్వరలో కధలు రాసే రోజులు త్వరలోనే వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

 

నటిగా మాత్రమే కాకుండా మంచి డాన్సర్ కూడ సింగర్ గా కూడ అలియా  కు మంచిపేరు ఉంది. గతంలో ఆమె నటించిన  సినిమాల్లో రెండు పాటలు తానే స్వయంగా ఆలపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ అలియాకు దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అలియాకు తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చినా ఆమె పట్టించుకోవడంలేదు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: