సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించ వలసిన   మూవీ రెగ్యులర్ షూటింగ్ పలుకారణాలు వల్ల వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు కరోనా కారణంగా ఈసినిమాకు సంబంధించి మొత్తం షూటింగ్ ప్లానింగ్ అంతా దెబ్బతింది. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి నెలలు గడిచిపోతున్నా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ కూడ లేకపోవడంతో బన్ని అభిమానులు అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.    

దీనికితోడు ‘రంగస్థలం’ రిలీజ్ అయి రెండేళ్లు పూర్తి అయినా మరో సినిమాను మొదలుపెట్టలేని సుకుమార్ దురదృష్టం పై చాలమంది సానుభూతి చూపెడుతున్నారు. దీనితో సుకుమార్ ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని నిశ్చయించుకుని ఈనెలలో ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ లుక్ రిలీజ్ చేసి తన పై సానుభూతి చూపెడుతున్న వారికి గట్టి సమాధానం ఇవ్వాలని నిశ్చయించకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే బన్నీ పాత్రకు సంబంధించి ఒక ఫొటో షూట్ కూడా సుకుమార్ షూట్ చేసాడు అని తెలుస్తోంది. ఆ ఫోటో షూట్ బాగా రావడంతో    ఆ షూట్ నుంచి కొన్ని ఫొటోలు ఎంచుకుని ఫస్ట్ లుక్ మీద సుకుమార్ ప్రస్తుతం వర్క్ చేస్తూ అల్లు అర్జున్ పుట్టినరోజునాడు ఈ ఫస్ట్ లుక్ విడుదల అయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.


ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అంతా దట్టమైన అరణ్యాల నేపధ్యంలో చేయవలిసిన పరిస్థితులలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలోని మారేడు మిల్లి ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా కరోనా ఎఫెక్ట్ వల్ల తేరుకుని మళ్ళీ షూటింగ్ లు మొదలైనా అసలు అరణ్యాలలో షూటింగ్ లు చేయడానికి ఇప్పట్లో అనుమతులు లభిస్తాయా అన్న అనుమానాలు కూడ సుకుమార్ కు ఉన్నట్లు టాక్. దీనితో ఇన్ని సందేహాల మధ్య ఈ మూవీ అనుకున్న విధంగా మొదలవుతుంది అన్న సంకేతాలు ఇవ్వడానికి సుకుమార్ ఇలా బన్నీ పుట్టినరోజును వాడుకుంటున్నాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: