ఓ అంద‌మైన పార్కులో ఫొటోల‌కు ఫోజులిచ్చిన దృశ్యాల‌ను ఆర్ ఎక్స్100 హీరోయిన్ త‌న ఇన్‌స్ట్రా గ్రాంలో నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుండ‌గా లాక్‌డౌన్ విధించిన బ‌య‌ట‌కు రావ‌డం ఏంట‌ని మండి ప‌డుతున్నారు. కొంత‌మంది నెటిజ‌న్ల‌తే..కొంచమ‌యిన బాధ్య‌త ఉండ‌క్క‌ర్లే అంటూ తీవ్ర‌మైన ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు జనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ చుట్టూ ఉండే జనాన్ని.. ఈ దేశాన్ని కాపాడండి అంటూ చెప్తూనే ఉన్నా..అత్యంత బాధ్యాత‌రాహిత్యంగా లాక్ డౌన్ ను ఉల్లంఘించి పార్కుల్లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Good things take time ♥️ . SHEIN Spring Collection is here @sheinoffical @shein_in #SHEIN#SHEINspringiton Discount code -SHSP255 extra 10% off any orders over INR 1500

A post shared by Payal Rajput (@rajputpaayal) on

ఇదిలా ఉండ‌గా ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసిన ఫొటోలు ఇప్ప‌టివి కావ‌ని గ‌తంలో తాను ఓ షూట్‌లో పాల్గొన్న‌వి అని తీరిపారిగా చెప్పుకొచ్చింది. గ‌తంలో తాను ఎంతో సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటూ అప్ప‌టి ఫొటోల‌ను షేర్ చేశాన‌ని చెప్పింది. మ‌ళ్లీ అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తున్నాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. అయితే అప్ప‌టికే ఈ హీరోయిన్‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. నెటిజ‌న్లు వంద‌ల సంఖ్య‌లో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం. అయితే ఇకొంత‌మంది మాత్రం ఈ బ్యూటీ హీరోయిన్ వివ‌ర‌ణ ఇచ్చాకా కూడా శాంతించ‌లేదు. 

 

అయినా ఇప్పుడు ఇలాంటి ఫొటోలు పెట్ట‌డం అవ‌స‌ర‌మా.. మీకెంతో మంది అభిమానులు ఉంటారు..క‌రోనాపై వారిలో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేసే మాట‌లు చెప్ప‌వ‌చ్చు క‌దా..అందాన్ని చూపే స‌మ‌యం కాదు అంటూ మండిప‌డ్డారు.  ఈ హీరోయిన్స్‌కి ఆరేసే గుణం తప్పితే.. సాయం చేసే గుణం లేదని నెటిజన్లు ఓ వైపు మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభనతో ఇండస్ట్రీ మొత్తం అతలాకుతలం అవుతున్న విష‌యం విదిత‌మే. షూటింగ్‌లు లేక.. సినిమాలు విడుదల కాక.. థియేటర్స్ మూతప‌డ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సుమారుగా మూడువేల కోట్లకు పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో మీకు చాత‌నైతే సినీ కార్మికులు, కళాకారులను ఆదుకోండి అంటూ హీరోయిన్‌కు సూచించారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: