తమ అభిమాన హీరో నుంచి కొత్త సినిమా వస్తుందంటే వారిలో అంచనాలు పెరిగిపోతూంటాయి. దీనికి క్రేజీ దర్శకుడు తోడైతే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. సినిమా రిలీజ్ అయ్యాక వారి అంచనాలకు ఏమాత్రం తక్కువగా ఉన్నా సినిమా రిజల్టే తేడా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితినే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాకు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా విడుదలై 9ఏళ్లు అయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు, నిర్మాత అశ్వనీదత్ కు కెరీర్ వరస్ట్ డిజాస్టర్ వస్తే దర్శకుడు మెహర్ రమేశ్ కు కెరీర్ లేకుండా పోయింది.

 

 

సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని ఎన్టీఆర్ అభిమానులు ఇంకా మర్చిపోలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి తమ అంచనాలను, మెహర్ రమేశ్ పై ఉన్న కోపాన్ని వెళ్లగక్కారు. అశ్వనీదత్ లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ ఉండి కూడా కథలో బలం లేకుండా ఎలా తీశావ్? అంచనాలు పెంచేసి సినిమాను రిలీజ్ చేసి ఉసూరుమనిపించావ్. అసలు అటువంటి గెటప్ లు ఎలా వేశావ్.. సినిమా ఫ్లాప్ చేయాలనే అలా తీశావా.. అంటూ నెట్టింట్లో ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయిపోయారు. సాధారణంగా హిట్ అయిన సినిమా గురించి అభిమానులు సంబరాలు చేసుకుంటారు. కానీ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లాప్ సినిమాను కూడా తలచుకున్నారంటే ఆ సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆలోచించాల్సిందే.

 

 

శక్తి పీఠం నేపథ్యంలో ఉండే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా భారీ ఫ్లాప్ ను దక్కించుకుంది. అశ్వనీదత్ కు భారీ నష్టాలు మిగిల్చింది. కథ, కథనాలపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. హిట్, ఫ్లాప్ లు ఎవరికైనా సహజమే అయినా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ప్రత్యేకించి శక్తి సినిమా విషయంలో మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో తమ బాధ, కోపాన్ని ప్రదర్శించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: