క‌రోనా కోర‌లు చాచింది. ప్ర‌తి ఒక్క‌రిని మింగేస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌డ‌గ‌డ‌లాడిపోతున్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశంలో డాక్ట‌ర్లు.. మెడికోలు.. ఆశా వ‌ర్క‌ర్లు.. ఎన్జీవోలు త‌మ ప్రాణాల‌కు తెగించి కొవిడ్-19 వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. వృత్తి ధ‌ర్మంలో భాగంగా మ‌హ‌మ్మారి కాటేస్తుంద‌ని తెలిసినా వృత్తిని వీడేది లేద‌ని ధైర్యంగా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేస్తున్నారు. ఇత‌ర న‌ర్సులు..వార్డు బాయ్ లు సైతం త‌మ ప్రాణాల‌ను లెక్క చేయ‌డం లేదు. సేవే ప‌ర‌మావ‌ధిగా భావించి ప‌నిచేస్తున్నారు. అయితే గాంధీ ఆసుప‌త్రిలో ఇలా చికిత్స చేస్తున్న వైద్యులు..ఇత‌ర సిబ్బంది పై క‌రోనా పేషెంట్ బంధువులు దాడి చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. అలా చేయ‌డం చాలా త‌ప్పు అయిన‌ప్ప‌టికీ వారి ఆవేశాన్ని అక్కడ ఎవ్వ‌రూ కూడా ఆప‌లేక‌పోయారు. దీనిపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

 

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. తాజాగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ త‌న‌దైన శైలిలో దాడి చేసిన వారి పై నిప్పులు చెరిగాడు. గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ ఓ అడుగు ముందుకేసి మాన‌వ హ‌క్కుల సంఘాల్ని ఎడా పెడా తిట్టేశాడు. అస‌లు మాన‌వ హ‌క్కుల సంఘాలు ఇప్పుడేమ‌య్యాయి? మంట‌గ‌లిసిపోయాయా? అంటూ ఆయ‌న మండిప‌డుతున్నారు.. డాక్ట‌ర్లు.. న‌ర్సులు.. పోలీసులు పౌరులు కాదా? వాళ్ళు మాత్రం మ‌న‌లాగా మ‌నుషులు కాదా వాళ్ళ‌ది మ‌న‌లాగా ప్రాణం కాదా అన్న‌ట్లు తిడుతున్నారు. నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌పై పౌర‌హ‌క్కుల సంఘాలు… మాన‌వ హక్కుల సంఘాలు మాట్లాడ‌వా? ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయేరేం అంటూ ఆయ‌న ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటున్నాయి.

 

ఢిల్లీ నుంచి ఇప్పుడు దిగుతారా దిగ‌రా? స‌జ్జ‌నార్ సార్ ని క‌డిగేయ‌డానికి మాత్రం తోసుకుంటూ ముందుకొస్తారు.. ఇలాంటప్పుడు మాత్రం టీవీల‌కు అతుక్కుపోతారా? అని విమ‌ర్శ‌లు గుప్పించాడు. హ‌రీష్ ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా  చేసిన ఈ వ్యాఖ్య‌లు సంచ‌న‌లంగా మారాయి. హ‌రీష్ వ్యాఖ్య‌ల‌కు చాలా మంది నెటిజ‌నులు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం మ‌ద్ద‌తు ప‌లికారు. చాలా క‌రెక్ట్ గా తిట్టారు డైరెక్ట‌ర్ గారు అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇప్పుడు హ‌రీష్‌కి అంద‌రూ సోష‌ల్ మీడియాలో సెల్యూట్ కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: