ఈ మద్య టాలీవుడ్ లో బాలీవుడ్,కోలీవుడ్ తర్వాత శాండిల్ వుడ్ భాషలకు చెందిన హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది.  ఈ నేపత్యంలో కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన వరుస ఛాన్స్ లు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. గతంలో వచ్చిన కొంత మంది కన్నడ బ్యూటీలకు ఇంత మంచి స్టార్ ఫాలోయింగ్ రాలేదు.  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన మూవీ జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించారు.  ఈ సినిమాలో నాని మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా  కనింపించిన విషయం తెలిసిందే.  నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ కి కూడా మంచి పేరు వచ్చింది.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు.  శ్రద్ధా శ్రీనాథ్‌ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న విషయం తాజాగా వెలుగుచూసింది.  కన్నడంలో ఈమె పలు సినిమాల్లో నటించడం వల్ల విమాన ప్రయాణాలు ఎక్కువగా చేయడం మూలాన ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తుంది. దీంతో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించిందని వార్తలు వచ్చాయి.

 

అయితే ఈ వార్తను శ్రద్ధా ఖండించింది. తాను ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటున్నామని.. మార్చి 12 -15 తేదీల మధ్య కాలంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశానని, ఆ విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని, అయినా తన ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని సోషల్ మాద్యం ద్వారా స్పష్టం చేసింది.   క్వారంటైన్‌ 14 రోజులు పూర్తయిందని, ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని కూడా సోషల్ మద్యమంలో చేసింది.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: