ప్రపంచ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది కరోనా వైరస్. ముఖ్యంగా మందు లేకపోవడంతో దేశాలన్నీ చాలావరకు వైరస్ నుండి తప్పించుకోవటానికి నియంత్రణ ఒకటే మార్గమని భావించి చాలావరకు దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇండియాలో కూడా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించింది. ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితుల్లో రావటంతో దేశంలో కీలక రంగాల్లో అన్ని స్తంభించిపోయాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ గట్టిగా పాటించడంతో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి.

 

ఇటువంటి టైములో కరోనా దెబ్బకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ సగానికి సగం పడిపోవడానికి రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. సినిమా షూటింగ్ చేయటంలో చాలా వరకు టైం తీసుకుంటున్న ప్రభాస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని సాహో సినిమా చేయడం జరిగింది. అయితే సాహో సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొట్టమొదటి షో కి అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు.

 

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అవుతుందని ఇటీవల నిర్మాతలు చెప్పటం జరిగింది. అయితే ఇంతలోనే కరోనా వైరస్ రావడంతో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఉన్న కొద్ది లేట్ పైగా బయట ప్రపంచంలో పరిస్థితులు పూర్తిగా మారిపోవటం తో ప్రభాస్ రేంజ్ సగానికి సగం పడిపోయాయని అవకాశం ఉందని...బ్రహ్మం రేషన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఎటువంటి స్టార్ హీరో అయినా ఫ్యాన్స్ పరంగా క్రేజ్ ఉన్న కానీ కమర్షియల్ గా వ్యాల్యూ తగ్గొచ్చు వాళ్లతో పాటు ప్రభాస్ కి తగ్గే అవకాశం ఉందని చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: